లక్ష్మీస్ ఎన్టీఆర్ పరిస్థితేంటి..?

ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎన్టీఆర్, చంద్రబాబులని హీరోలుగా చూపెట్టడానికే చేశారనే విషయం సగటు ప్రేక్షకుడు గ్రహించబట్టే ఆ సినిమాలు భారీ డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఎన్టీఆర్ [more]

Update: 2019-03-21 07:53 GMT

ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎన్టీఆర్, చంద్రబాబులని హీరోలుగా చూపెట్టడానికే చేశారనే విషయం సగటు ప్రేక్షకుడు గ్రహించబట్టే ఆ సినిమాలు భారీ డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అసలైన ఘటనలు చూపెట్టకుండా అసంపూర్ణంగా ఆ సినిమాలను ముగించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. మరి ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో జరిగిన అనేక చేదు ఘటనలతో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెరకెక్కించాడు. టీడీపీ, బాలకృష్ణ మీదున్న కోపంతో వర్మ ఆ సినిమాని తీసినా అందులో వాస్తవాలు లేకపోలేదు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పెళ్లి, ఆయన మరణం వంటి విషాయాలన్నీ వర్మ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

హిట్ అయితే ఓకే…

అందుకే సినిమాకి కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. అందులోనూ ఎన్నికల సమయంలో వర్మ ఈ సినిమాని విడుదల చెయ్యడం కూడా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడటానికి కారణమయ్యింది. అయితే భారీ అంచనాల నడుమ మార్చ్ 29న థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా విడుదలయ్యాక కూడా ఆ క్రేజ్ ని మెయింటైన్ చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం డల్ గా ఉన్న బాక్సాఫీసు మీద ఈ సినిమాను వదలడం కరెక్ట్ అయిన పనే… సినిమా మీదున్న అంచనాలతో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా ఆడెయ్యడం గ్యారెంటీ. అంతలా మంచి సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు జనాలు. ఇలాంటి టైంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ దిగుతుంది. మరి వర్మ ప్రేక్షకుల అంచనాలు అందుకుంటే సినిమా సూపర్ హిట్. లేదా వర్మ డిజాస్టర్స్ లో అదొకటి.

మజిలీ ఎఫెక్ట్ పడుతుందా..?

అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి వర్మ ఫ్రీ ఆబ్లిసిటి బాగానే ఉంది కానీ ఆ సినిమా స్క్రీన్ మీద చూడాలంటె కాస్త కష్టమే. ఎందుకంటే సినిమా క్వాలిటీ తక్కువగా కనబడుతుంది. అలాగే ఆర్టిస్ట్స్ కూడా ఎవరికీ తెలియని మొహాలు కావడం, వర్మ గత చిత్రాల డిజాస్టర్స్ తో ఆయన దర్శకత్వంపై అపనమ్మకం వెరసి సినిమా టాక్ మీద వర్మ భవిష్యత్తు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ కి మరో గండం… ఏప్రిల్ 5న నాగచైతన్య – సమంత మజిలీ సినిమా విడుదలవుతుంది. మజిలీ సినిమా మీద భారీ క్రేజ్ ఉంది. పెళ్లి తర్వాత చైతు, సామ్ కలిసి నటించిన మొదటి సినిమా కావడం, శివ నిర్వాణకు మంచి ట్రాక్ రికార్డ్ ఉండడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ టాక్ పడితే ఓకె… లేదంటే మజిలీ ప్రభంజనంలో కొట్టుకుపోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News