బాలయ్యకి షాకిచ్చిన వర్మ..?

గత రెండు నెలలుగా సినిమాల కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యింది. వర్మ ఇచ్చిన హైప్ కి ప్రేక్షకులు [more]

Update: 2019-04-02 06:22 GMT

గత రెండు నెలలుగా సినిమాల కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యింది. వర్మ ఇచ్చిన హైప్ కి ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. సినిమాకి ఫ్లాప్ టాకొచ్చినా.. థియేటర్స్ ఫుల్ అవుతున్నాయంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద ఎంతగా ఇంట్రెస్ట్ కలిసాగించాడో అర్ధమవుతుంది. అయితే సినిమాలో వర్మ చెప్పినంత అయితే లేదు కానీ సినిమాల కోసం ఎదురుచూస్తున్న జనాలకు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏకైక ఆప్షన్ గా నిలవడంతో ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. మరి భారీ బడ్జెట్ తో భారీ లెవల్లో క్రేజ్ తో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు తలదన్నే రీతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కలెక్షన్స్ ఉన్నాయని.. ఓవర్సీసీ లో అయితే ఎన్టీఆర్ బయోపిక్ కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ కే క్రేజ్ ఎక్కువ ఉందని అంటున్నారు.

ఓవర్సీస్ కలెక్షన్స్ అదుర్స్

మొదటి రోజు రివ్యూస్, టాక్ ఎలా ఉన్నా మంచి ఓపెనింగ్స్ ని తెలంగాణలో, ఓవర్సీస్ లో సాధించిన లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఫస్ట్ వీకెండ్ లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 2,43,720 డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ – క్రిష్ ల ఎన్టీఆర్ మహానాయకుడు లాంగ్ రన్ లో 2 ల‌క్ష‌ల 18 వేల డాల‌ర్ల‌ను కొల్లగొడితే.. లక్ష్మీస్ ఎన్టీర్ కేవలం ఫస్ట్ వీకెండ్ లోనే రెండు ల‌క్ష‌ల 45 వేల డాల‌ర్ల‌ను కొల్లగొటింది. మరి తెలంగాణలో కలెక్షన్స్ ఎలా ఉన్నా ఓవర్సీస్ లో బాలయ్యకి వర్మ గట్టి షాక్ ఇచ్చాడు. అయితే నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కలెక్షన్స్ ఓవర్సీస్ లోనే కాదు.. తెలంగాణలోనూ డ్రాప్ అయినట్లుగా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News