నెగటివ్ గా సైలిష్ గా చూపిస్తాడా?

Update: 2018-08-04 06:11 GMT

రామ్ చరణ్ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా ని నిర్మాత డి వి వి దానయ్య తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటుగా ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాగా బోయపాటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదటిసారి రామ్ చరణ్ - భరత్ భామ కియారా అద్వానీ లు జంటగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అన్నయ్యలుగా పవర్ ఫుల్ పాత్రల్లో టాలీవుడ్ నటుడు ఆర్య రాజేష్, తమిళ నటుడు ప్రశాంత్ లు నటిస్తున్నారనే టాక్ సినిమా మొదలైనప్పవుడే వినబడింది.

స్టయిలిష్ గా..నెగిటివ్ షేడ్స్ తో.....

విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదేమిటంటే ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ప్రత్యేకత కలిగిన మరో నెగెటివ్ రోల్ లో ఆర్యన్ రాజేశ్ స్టయిలిష్ గా కనబడతాడట. ఇక ఆర్యన్ పాత్రని బోయపాటి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసాడని... అంటున్నారు. మరి సరైనోడు సినిమాలో హీరో ఆది పినిశెట్టిని బోయపాటి ప్రెజెంట్ చేసిన తీరు ఎప్పటికి మరువలేదు. నెగెటివ్ షేడ్స్ తో చాలా స్టైలిష్ లుక్స్ తో విలన్స్ ఇలా కూడా ఉంటారా అనిపించేలా ఉంటుంది ఆది పాత్ర.

చాలా కాలం తర్వాత.....

మరి ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కూడా చాలాకాలం వెండితెరకు దూరమైన ఆర్యన్ రాజేష్ ని ఎలా చూపెడతాడో అనే విషయం మాత్రమే అందరిలో కాస్త ఆసక్తి కలగజేస్తుంది. మరి నిజంగానే ఆర్యన్ నెగెటివ్ పాత్ర అందరికి కనెక్ట్ అయితే గనక ఈ సినిమాతో మళ్ళీ ఆర్యన్ రాజేష్ సినిమాల్లో బిజీ అవ్వగలుగుతాడు.. లేదంటే...!

Similar News