కూల్ కూల్ గా.. రిలాక్స్ అవుతూ...!

Update: 2018-05-21 07:54 GMT

రామ్ చరణ్ ధృవ సినిమా దగ్గర నుంచి చాలా మారిపోయాడు. ధృవ సినిమాలో రామ్ చరణ్ మైండ్ తో ఆడే గేమ్ తో పాటు చరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతమైన నటన కనబరిచాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చెవులు సరిగ్గా వినపడని చిట్టిబాబుగా అదరగొట్టే నటనతో ఏ స్టార్ హీరో చెయ్యని అసామాన్యమైన సాహసంతో రంగస్థలం లో అదరగొట్టాడు. రామ్ చరణ్ చేసిన సాహసానికి ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. రాంచరణ్ రంగస్థలం కోసం శరీరాన్ని మొద్దోడు అంటే పక్కా పల్లెటూరి యువకుడిలా రఫ్ గా తయారు చేసాడు. ధృడమైన శరీరంతో చిట్టిబాబుగా రామ్ చరణ్ మెప్పించాడు.

కండలు కరిగించే పనిలో...

అయితే ఆ కండలను #RC 12 కోసం కరిగించడానికి జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. బోయపాటి డైరెక్షన్ లో #RC 12 సినిమాలో నటిస్తున్నరామ్ చరణ్ ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటూనే హీరోయిన్ కియారా తో కలిసి తెగ వర్క అవుట్స్ చేస్తున్నాడు. మరి కష్టే ఫలి అన్నట్టుగా సినిమా సినిమా కి వేరియేషన్ చూపిస్తూ అభిమానులను, ప్రేక్షకులను మెప్పించాలంటే ఆ మాత్రం కష్టపడాలి. ఇక చెర్రీ భార్య ఉపాసన చరణ్ చేసే ప్రతి పనిని సోషల్ మీడియా ద్వారా అందరికి షేర్ చేస్తుంది. నిన్నటికి నిన్న చరణ్ ఖాళీ సమయాల్లో చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పడమే కాదు, #RC 12 కోసం చరణ్ కష్టపడుతున్న జిమ్ వర్క్ అవుట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పచ్చని చెట్లు...స్విమ్మింగ్ పూల్ నడుమ...

ఇక ఈ రోజు షూటింగ్ లేని తీరిక సమయంలో చరణ్ ఎంతో కూల్ గా చెట్ల మ‌ధ్య రిలాక్స్ గా ఉన్న ఓ ఫోటోను ఉపాస‌న ట్వీట్ చేసింది. ఇక ఆ ఫొటోతో పాటుగా 'బిజీబిజీ షెడ్యూల్‌కు ముందు నిశ‌బ్ద‌మైన స‌మ‌యం. ఆశావ‌హ‌దృక్ప‌థాన్ని, శ‌క్తిని పెంపొందించుకోవ‌డానికి మ‌న‌తో మ‌నం క‌నెక్ట్ కావ‌డం ఎంతో ముఖ్యం' అంటూ ట్వీట్ చేసింది. మరి ఆ పిక్ లో చరణ్ వెనుకగా స్విమ్మింగ్ పూల్, అలాగే చరణ్ పచ్చని చెట్లు చూస్తూ కూల్ గా ఉన్న ఆ పిక్ ని చూస్తూ మెగా ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Similar News