సంక్రాంతి తర్వాత చరణ్ ఆచార్య లోకి!!

కరోనా తో వాయిదా పడిన సినిమా షూటింగ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ సెట్స్ మీద కళకళలాడుతున్నాయి. రాజమౌళి RRR దగ్గరనుండి చిరు ఆచార్య వరకు అందరూ సెట్స్ [more]

Update: 2020-11-28 09:24 GMT

కరోనా తో వాయిదా పడిన సినిమా షూటింగ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ సెట్స్ మీద కళకళలాడుతున్నాయి. రాజమౌళి RRR దగ్గరనుండి చిరు ఆచార్య వరకు అందరూ సెట్స్ మీద సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ RRR చిత్రీకరణ లో బిజీ. అయితే RRR షూటింగ్ కొలిక్కి రాగానే రామ్ చరణ్ తండ్రి ఆచార్య సినిమా కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఆచార్య లో రామ్ చరణ్ కోసం అదిరిపోయే రోల్ ని సిద్ధం చేసి ఉంచాడు దర్శకుడు కొరటాల. ఆచార్య సినిమా షూటింగ్ కూడా మొదలు కావడం, తాజాగా ఆచార్య షూటింగ్ లో చిరు పాల్గొనడం జరుగుతుంది. అయితే RRR తో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆచార్య కోసం రాక ఆలస్యమవుతుంది అని.. దాని కోసం ఆచార్య షూటింగ్ వాయిదా పడినా పడొచ్చనే ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఆచార్య కోసం రాబోయే డేట్స్ ని కన్ఫర్మ్ చేసాడట. రాజమౌళి కూడా ఆచార్య కోసం రామ్ చరణ్ కి పర్మిషన్ ఇచ్చేసాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. రామ్ చరణ్ సంక్రాతి వరకు RRR షూటింగ్ లో పాల్గొంటాడని, పండగ తర్వాత ఓ 20 రోజుల పాటు ఆచార్య కోసం రామ్ చరణ్ డేట్స్ కేటాయిస్తున్నాడని అంటున్నారు. ఆ 20 రోజుల్లోనే రామ్ చరణ్ సన్నివేశాల చిత్రీకరణ ని పూర్తి చేస్తాడట కొరటాల. మరి RRR తో బిజీగా ఉన్న రామ్ చరణ్ కి డేట్స్ కుదరకపోతే ఎలా అనే కంగారులో కొరటాల ఉన్నప్పటికీ.. రాజమౌళి కొరటాలకి పెద్దగా కంగారు పెట్టకుండానే చరణ్ ని పంపేస్తున్నాడట.

Tags:    

Similar News