అబ్బాయ్... బాబాయ్ లు మరోసారి కలిసి..!!

Update: 2018-05-03 16:24 GMT

కృష్ణ వంశి డైరెక్షన్ లో వచ్చిన గోవిందుడు అందరివాడు సినిమాలో రామ్ చరణ్ కి బాబాయ్ గా హీరో శ్రీకాంత్ నటించాడు. ఆ సినిమాలో చరణ్ బాబాయ్ కింద శ్రీకాంత్ కి మంచి పాత్రే దక్కింది. అబ్బాయ్ చరణ్ బాధ్యతగల యువకుడిగా గోవిందుడు లో నటిస్తే.. శ్రీకాంత్ మాత్రం బాధ్యతలేని వాడిలా ఇంటినుండి గెంటివేసిన పాత్రలో మురిపించాడు. అయితే మరోమారు ఈ అబ్బాయ్ - బాబాయ్ ల కాంబో రిపీట్ కాబోతుంది. అది కూడా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతూన్న సినిమాలోనేనట. రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అప్పుడే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్ లో బిజీగా వుంది.

చరణ్ చెప్పగానే.....

అయితే చరణ్ - బోయపాటి సినిమాలో ఒక కీలకమైన రోల్ కోసం ఒక సీనియర్ నటుడిని తీసుకుంటే బావుంటుందని ఆలోచనలో బోయపాటి ఉండగా... అయితే అతి ముఖ్యమైన కీలక పాత్రకి శ్రీకాంత్ తీసుకుంటే ఎలా ఉంటుందని చరణ్, బోయపాటి తో చెప్పగా... వెంటనే ఆ రోల్ కోసం శ్రీకాంత్ ని తీసుకోవడానికి బోయపాటి ఓకె చెప్పేశాడట. ఇక శ్రీకాంత్ అధికారికంగా ఈ సినిమాలో నటిస్తున్నాడని.. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ లో శ్రీకాంత్ నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి చిరంజీవికి దేవుడిచ్చిన తమ్ముడిగా శ్రీకాంత్ ని చెబుతుంటారు.మరి ఆ ప్రేమతోనే శ్రీకాంత్ ని ఈ సినిమాలోకి తీసుకోమని చరణ్... బోయపాటికి సూచించినట్టుగా ఉన్నాడు. ఇకపోతే కైరా అద్వానీతో రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఈ సినిమా లో రామ్ చరణ్ కి విలన్ గా నటిస్తున్నాడు.

Similar News