రామ్ చరణ్ నెక్స్ట్ ఎవరు?

రామ్ చరణ్ వినయ విధేయరామ బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత రాజమౌళి తో బిగ్ క్రేజీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా RRR మూవీ చేస్తున్నాడు. RRR మొదలయ్యాక మెగా [more]

Update: 2020-07-13 06:56 GMT

రామ్ చరణ్ వినయ విధేయరామ బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత రాజమౌళి తో బిగ్ క్రేజీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా RRR మూవీ చేస్తున్నాడు. RRR మొదలయ్యాక మెగా ఫాన్స్ వినయ విధేయరామ సినిమా డిజాస్టర్ ని మర్చిపోయారు. అయితే RRR కి రెండేళ్లు కేటాయించిన రామ్ చరణ్ తర్వాత చిరు ఆచార్య లో ఓ 30 నిమిషాల కీలక పాత్ర చెయ్యబోతున్నాడు. అయితే కరోనా వల్ల RRR అండ్ ఆచార్య షూటింగ్స్ మొత్తం తారుమారైంది. ఇక RRR అవ్వాలి.. ఆచార్య షూటింగ్ లోకి రామ్ చరణ్ వెళ్ళాలి. కానీ కరోనా ఇంకా భయపెడుతూనే ఉంది. అయితే రామ్ చరణ్ RRR, ఆచార్య తర్వాత ఏ మూవీ చెయ్యబోతున్నాడో అనేది ఇప్పుడు ఆసక్తికర న్యూస్.

రామ్ చరణ్ నెక్స్ట్ ఏంటి అంటూ మెగా అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. అందరూ సినిమాలు సెట్స్ మీదున్నప్పుడే నెక్స్ట్ మూవీ అంటూ కమిట్ అవుతుంటే.. రామ్ చరణ్ మాత్రం ఇంకా నాన్చుతూనే ఉన్నాడు. అయితే రామ్ చరణ్ ఓ కొత్త దర్శకుడితో అంచనాలు లేకుండా ఓ మూవీ కమిట్ అయ్యాడని.. RRR భారీ ప్రాజెక్ట్ తర్వాత అంచనాలు లేని మూవీ చేస్తాడని అన్నారు. తాజాగా వంశి పైడిపల్లితో రామ్ చరణ్ మూవీ అంటున్నారు. మహేష్ రిజెక్ట్ చేసాక వంశి రామ్ చరణ్ ని కలిసి కథ చెప్పి ఒప్పించాడని.. ఈ లాక్ డౌన్ లో వంశి పైడిపల్లి – రామ్ చరణ్ మూవీ ఒకే అంటూ సోషల్ ఇండియాలో వార్తలు రావడమే కానీ.. రామ్ చరణ్ ఇంతవరకు ఎలాంటి కథ వినడం కానీ, ఏ డైరెక్టర్ ని ఓకే చెయ్యడం కానీ జరగలేదట,. తన కోసం వచ్చిన దర్శకులను తన తండ్రికి సెట్ చేసే పనిలో ఉన్నాడు కానీ.. తన కోసం మాత్రం ఇంకా తన నెక్స్ట్ మూవీ ని సెట్ చెయ్యలేదు అంటూ మెగా కాంపౌండ్ న్యూస్. 

Tags:    

Similar News