ఇంటర్వెల్ సీన్... ఫిదా అయిన చరణ్!

Update: 2018-05-05 09:00 GMT

రామ్ చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం' సినిమాతో రెండు రకాలుగా హ్యాపీగా ఉన్నాడు. ఒకటి తన నటన గురించి చాలా మంది మాట్లాడుకోవడం.. మరొకటి 'రంగస్థలం' సినిమా నాన్ 'బాహుబలి' ని కొట్టి ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సెట్ చేయడం. అటు ఈ సినిమాను కొన్న బయర్స్ కూడా చాలా హ్యాపీగా ఉండడంతో చరణ్ మహా ఖుషీగా ఉన్నాడు.

భారీ యాక్షన్ సీన్స్....

అదే జోష్ తో బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ పాల్గొన్నాడు చరణ్. చరణ్ తో బోయపాటి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసి షూట్ చేసాడని తెలుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ ఫైట్ సీన్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ అని.. మూవీ మొత్తానికి హైలైట్ గా నిలిచేంతటి యాక్షన్ డోస్ ఉంటుందని అంటున్నారు. ఈ ఫైట్ సీన్ తో రామ్ చరణ్ తో పాటు యూనిట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు సమాచారం.

దసరాకు విడుదల చేయాలని....

ఈ సినిమాలో కోలీవుడ్ సీనియర్ హీరో ప్రశాంత్.. స్నేహలు కొన్ని కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా కనిపించనున్నాడు. ఇక చరణ్ కి జోడిగా 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దసరా కి ముందే ఫినిష్ చేసి దసరా పండగకు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

Similar News