చరణ్ తర్వాతే చిరునా?

చిరంజీవి సినిమాలోకి కం బ్యాక్ అయ్యేసరికి రామ్ చరణ్ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇక మొదట్లో చిరు రామ్ చరణ్ కథలను విని ఓకె [more]

Update: 2020-10-10 16:29 GMT

చిరంజీవి సినిమాలోకి కం బ్యాక్ అయ్యేసరికి రామ్ చరణ్ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇక మొదట్లో చిరు రామ్ చరణ్ కథలను విని ఓకె చేసిన… తర్వాత తర్వాత రామ్ చరణ్ ఓన్ డెసిషన్స్ తో పైపైకి వచ్చాడు. అయితే చిరు కం బ్యాక్ అయ్యాక చిరు విషయాలను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయన తో సినిమాలు నిర్మించడమే కాదు…. చిరంజీవి కోసమా వచ్చే కథలని చరణ్ విన్నాకే చిరు దగ్గరికి వెళుతున్నాయని టాక్ ఎప్పటినుండో ఉంది. తాజాగా రామ్ చరణ్ తండ్రి కథల మీదే లాక్ డౌన్ లో స్పెండ్ చేసాడని.. బాబీ దగ్గరనుండి మెహెర్ రమేష్ వేదాళం రీమేక్, వినాయక్ ని లూసిఫెర్ కి తేవడానికి కారణం కూడా చరణే అంటున్నారు.

తన అనుభవంతో తండ్రి ఏ కథ చేస్తే బావుంటుంది, ఏ దర్శకుడితో సినిమా చేస్తే బావుంటుంది అని అన్ని ఆలోచిస్తున్నాడట. ఇక తండ్రి స్ట్రయిట్ కథలతో చేసే కన్నా సేఫ్ గా రీమేక్ లు నమ్ముకుంటే బావుంటుంది అని చిరు కి సలహా ఇచ్చింది కూడా చరణే అంటున్నారు.

గతంలో కత్తి రీమేక్ చెయ్యడం దగ్గరనుండి, తర్వాత చిరు ఉయ్యాలవాడ స్టోరీతో సై రా చెయ్యడానికి చరణే కారణమని తెలుసు. ఇక కొరటాల రామ్ చరణ్ కోసం కథ తెస్తే దాన్ని చిరుకి తగిలించాడన్నారు. ఇక లూసిఫెర్ కన్నా ముందే సుజిత్ ఫ్రెష్ కథతో చెర్రీ దగ్గరికి వస్తే చరణ్ కావాలనే లూసిఫెర్ రీమేక్ చెయ్యమని సుజిత్ ని ఇరికించాడంటారు. తర్వాత లూసిఫెర్ నుండి సుజిత్ ని తప్పించి ఆ ప్లేస్ లోకి వినాయక్ వచ్చేలా చేసింది చరణే అంట. ఇక తమిళ వేదాళం రీమేక్ డాడ్ చిరుకి పర్ఫెక్ట్ అని దాన్ని మెహెర్ రమేష్ తో సెట్ చేయించాడట. బాబీ కథ కూడా చరణ్ విన్నాకే చిరు ఓకె చేసాడట. ఇక చిరు సినిమాల టెక్నీకల్ విభాగాన్ని కూడా చరణే దగ్గరుండి ఫైనల్ చేస్తున్నాడట. మరి చిరు దగ్గరకి వెళ్లాలనుకునే దర్శకులు ముందు చరణ్ ని కలిస్తే సరి.

Tags:    

Similar News