చరణ్ తరువాతే బాలకృష్ణ

ఈ సంక్రాంతి కి నాలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రాలు రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’….’ఎన్టీఆర్’ బయోపిక్ కే. [more]

Update: 2018-12-30 11:42 GMT

ఈ సంక్రాంతి కి నాలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రాలు రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’….’ఎన్టీఆర్’ బయోపిక్ కే. ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతుండంతో ఏ సినిమా ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులు దేన్నీ బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు? అనేది తెలుసుకోవాలంటే ఆయా ట్రెయిలర్స్‌కి వచ్చిన వ్యూస్ బట్టి తెలుసుకోవచ్చు.

బోయపాటి డైరెక్షన్ లో పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘వినయ విధేయ రామ’ థియేట్రికల్ ట్రైలర్ వచ్చి మూడు రోజులు కాకుండానే 10 మిలియన్‌ వ్యూస్‌ దాటేసింది. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ట్రైలర్ వచ్చి వారం అవుతున్న 10 మిలియన్‌ వ్యూస్‌ చేరుకోవడానికి ఇబ్బంది పడుతుంది. సో ఈ రెండు సినిమాల్లో ‘వినయ విధేయ రామ’కి లీడ్‌ అండ్‌ అడ్వాంటేజ్‌ వున్నాయి.

ఫామిలీస్ తో పాటు యూత్ కూడా ఈసినిమాని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. సంక్రాంతి సీజన్ కాబట్టి సెలవలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈసినిమా కు యావరేజ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సంక్రాంతి కి వీటి తో పాటు ‘ఎఫ్‌2’ , రజనికాంత్ ‘పేట’ కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో ..ఎవరు రేస్ లో విన్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News