ప్రేమించిన అబ్బాయిలకి రామ్ సలహా..!

Update: 2018-10-01 06:52 GMT

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రేమించిన అబ్బాయిలకి ఓ మంచి సలహా ఇచ్చాడు. ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఎలా ఒప్పించాలో ఓ ఐడియా ఇచ్చాడు. "వీడు పెళ్లి చేసుకుంటే చాలురా బాబూ" అని ఇంట్లో వాళ్లు అనుకుంటున్న టైంలో ఆ అమ్మాయని ఇంటికి తీసుకుని వెళ్తే వెంటనే ఓకే చెప్పేస్తారు అని సలహా ఇచ్చాడు. అయితే మరి రామ్ కూడా అదేవిధంగా చేస్తాడో లేదో అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పటివరకూ ఏ అమ్మాయి నచ్చలేదని తెలిపాడు.

ఎంగేజ్మెంట్ వార్తలు పుకార్లే...

తనకు నచ్చి కనెక్ట్ అయితే వెంటనే ఆ అమ్మాయిని ఓ అర్ధ‌రాత్రి రామ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని మీడియాకు ఫోన్ రావొచ్చని రామ్ తెలిపాడు. అయితే 'పండగ చేసుకో' మూవీ టైంలో తనకు రకుల్ కి ఎంగేజ్‌మెంట్ అయిందని వచ్చిన వార్తలు రామ్ ఖండించాడు. అయితే ఆ రూమర్ తన వరకు రాలేదని రామ్ తెలిపాడు. తన మీద అసలు పుకార్లు రావని.. ఇప్పటివరకు రాలేదని చెప్పాడు. ఏమైనా రూమర్స్ వచ్చినా అవి మా అన్నయ్య, లేదా స్నేహితులు చెబుతుంటారు. అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళు.."నీ మీద గాసిప్స్ రావడం లేదేంటి?’ అని ఆట పట్టిస్తుంటారు”. అని రామ్ అన్నాడు.

Similar News