ఇస్మార్ట్ దుకాణం సర్దేసాడు

రామ్ పోతినేని – పూరి జగన్నాధ్ కి అనుకోకుండా తగిలిన హిట్ ఇస్మార్ట్ శంకర్. అనుకోకుండా అదృష్టం కొలది తగలడం ఏమిటా అనుకుంటున్నారేమో….. క్రిటిక్స్ మొత్తం ముక్త [more]

Update: 2019-08-21 06:02 GMT

రామ్ పోతినేని – పూరి జగన్నాధ్ కి అనుకోకుండా తగిలిన హిట్ ఇస్మార్ట్ శంకర్. అనుకోకుండా అదృష్టం కొలది తగలడం ఏమిటా అనుకుంటున్నారేమో….. క్రిటిక్స్ మొత్తం ముక్త ఖంఠంతో సినిమాని యావరేజ్ గా తేల్చిపారేసినా… యూత్ కి ఇస్మార్ట్ శంకర్ బాగా ఎక్కేయ్యడంతో.. సినిమాని అమ్మిన దానికన్నా డబుల్ సంపాదించారు నిర్మాతలు. రామ్ కెరీర్ లోనే ఇస్మార్ట్ శంకర్ బెస్ట్ ఫిలిం గా నిలిచిపోయింది. చాలారోజుల తర్వాత పూరి జగన్నాధ్ నిర్మాతగా, దర్శకుడిగా హిట్ కొట్టాడు. ఇక దెబ్బకి విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్ తో సినిమా కూడా పట్టాడు పూరి జగన్నాద్. ఇస్మార్ట్ శంకర్ హవా రెండు మూడు వారలు జోరుగా సాగింది. తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత సంపాదించింది అంటే…

ఏరియా: క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం 13.60
సీడెడ్ 5.45
అర్బన్ ఏరియాస్ 3.80
ఈస్ట్ గోదావరి 2.05
గుంటూరు 1.95
వెస్ట్ గోదావరి 1.75
కృష్ణ 2.00
నెల్లూరు 1.05

ఏపీ అండ్ టీఎస్ షేర్స్: 31.65
ఇతర ప్రాంతాలు 1.90
ఓవర్సీస్ 1.00

వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్: 34.55

Tags:    

Similar News