రామ్ అందుకే ప్రమోషన్స్ కి రావడంలేదు

ఎనర్జటిక్ హీరో రామ్ హీరోగా పూరి జగన్నాధ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ నిన్నే రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా సూపర్ హిట్ టాక్ [more]

Update: 2019-07-19 06:51 GMT

ఎనర్జటిక్ హీరో రామ్ హీరోగా పూరి జగన్నాధ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ నిన్నే రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రామ్ నటన, పూరి డైరెక్షన్, మణిశర్మ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్లిందని అంటున్నారు.

సినిమా విడుదల తరువాత హీరో రామ్ ప్రమోషన్స్ కి రావడం లేదు. కారణం పూరి అండ్ రామ్ ఇద్దరికీ పడడంలేదని షూటింగ్ టైంలోనే ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని తాజా సమాచారం.

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ముందుగానే ఈనెల 12 న రిలీజ్ కావాల్సివుంది. కానీ కొన్ని కారణాలు వల్ల వాయిదా పది ఈనెల 18 న రిలీజ్ అయింది. రామ్ 12 న రిలీజ్ అవుతుంది అనుకుని ముందుగానే తన కుటుంబ సభ్యులతో స్పెయిన్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాడట. కానీ రిలీజ్ ఏమో 18 న అయింది కనుక అందుకే ప్రమోషన్స్ కి రామ్ రావడం కుదరదు కాబట్టి రాలేదని సమాచారం. సో దీని వల్ల రామ్ – పూరి ల మధ్య ఎలాంటి మనస్పర్థలు తలెత్తలేదనేది సన్నిహితుల మాట

Tags:    

Similar News