అదేంటి మళ్లీ 'నేను శైలజ' పోస్టర్ ను రిలీజ్ చేసారు?

Update: 2018-05-16 08:57 GMT

యంగ్ హీరో రామ్ పోతినేనికి హిట్ వచ్చి దాదాపు రెండేళ్లు అయిపోతుంది. 'నేను శైలజ' సినిమా తర్వాత చేసిన 'హైపర్', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు ఫ్లాప్ కావడంతో బాగా అలోచించి తన నెక్స్ట్ మూవీ నాని డైరెక్టర్ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నానితో 'నేను లోకల్' సినిమాను తీసిన నక్కిన త్రినాథరావుతో రామ్ తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు.

అచ్చం అలాంటిదే...

ఈ సినిమా దిల్ రాజు నిర్మాణం కావడంతో ఆసక్తి బాగానే ఉండగా 'హలో గురూ ప్రేమ కోసమే' అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టడం మరింతగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ముందు పుస్తకాలు పట్టుకుని నడుస్తూ ఉంటే వెనకాల హీరో రామ్ తనదైన స్టైలింగ్ తో నడుచుకుంటూ స్మైల్ ఇస్తూ రావడం ఈ పోస్టర్ లో కనిపిస్తుంది.

ఓ ఆట ఆడుకుంటన్న నెటిజన్లు...

ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ పోస్టర్ చూస్తుంటే 'నేను శైలజ' మూవీ పోస్టర్ గుర్తుకు వచ్చిందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. అప్పట్లో 'నేను శైలజ' నుండి డిట్టో ఇటువంటి పోస్టర్ ఒక్కటి రిలీజ్ చేసారు. ఆ పోస్టర్, ఈ పోస్టర్ రెండు ఒక్కలానే ఉన్నాయ్. రామ్ లుక్ కూడా 'నేను శైలజ'లో లుక్ లా ఉండడంతో పోలిక పెట్టి మరీ నెటిజన్లు రఫ్ఫాడిస్తున్నారు. అదేంటి మళ్లీ 'నేను శైలజ' పోస్టర్ ను రిలీజ్ చేసారు? అని కామెంట్స్ చేస్తున్నారు.

Similar News