వర్మ ట్వీట్ ఎన్టీఆర్ టీంలో టెన్షన్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి వివాదాలు అంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు. అతను చేసే ప్రతి సినిమాలో కాంట్రవర్సీ లేకుండా అసలు తీయడు. [more]

Update: 2019-02-13 05:19 GMT

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి వివాదాలు అంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు. అతను చేసే ప్రతి సినిమాలో కాంట్రవర్సీ లేకుండా అసలు తీయడు. ఇప్పుడు రీసెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ కి కౌంటర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను తీస్తున్నాడు. వాస్తవానికి ఇందులో చంద్రబాబు పాత్ర ఎలా చూపిస్తాడో అని ఈసినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి .

ఇక ఈసినిమా టీజర్ ప్రేమికులు రోజు సందర్భంగా విడుదల చేస్తునట్టు ప్రకటించాడు రాము. అయితే ఇప్పుడు తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను ‘యన్‌టిఆర్‌-మహానాయకుడు’ రిలీజ్ రోజున రిలీజ్ చేస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 22న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నాడు.

నిన్న మహానాయకుడు రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేయడంతో.. తన సినిమా ట్రైలర్‌ను కూడా ఆ మూవీతో పాటు చూడండి అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. టీజర్ ను ఫిబ్రవరి 14న 9.27గంటలకు విడుదల చేస్తున్నాము…ట్రైలర్ ను మహానాయకుడు తో పాటు రిలీజ్ చేస్తన్నాము. ఈసినిమా చూడటానికి వచ్చినా వారు మా మూవీ ట్రైలర్ కూడా చూడొచ్చు అని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం రాము చేసిన ట్వీట్ చర్చనీయాశంగా మారింది

Tags:    

Similar News