లక్ష్మి పార్వతి కన్నీళ్లు తుడిచేదెవరో

రామ్ గోపాల్ వర్మ లక్ష్మి పార్వతిని బేస్ చేసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ అవసాన ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతిని పాజిటివ్ [more]

Update: 2019-02-15 04:08 GMT

రామ్ గోపాల్ వర్మ లక్ష్మి పార్వతిని బేస్ చేసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ అవసాన ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతిని పాజిటివ్ గా చూపిస్తూ ఎన్టీఆర్ అల్లుడు చందరబాబు నాయుడుని, నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ఆవశాన దశలో చేసిన కుట్రలు కుతంత్రాలను లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించబోతున్నాడని… నిన్న ప్రేమికుల రోజు న వదిలిన ట్రైలర్ లో అర్ధమయ్యింది. లక్ష్మి పార్వతిని హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ 1989 ఎన్నికల తర్వాత ఫ్యామిలీకి దూరమవడం, లక్ష్మి పార్వతికి దగ్గరవడం, లక్ష్మి పార్వతి వలన ఎన్టీఆర్ పడిన అవమానాలు అన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ లో రామ్ గోపాల్ వర్మ పాజిటివ్ గా చూపించాడు. అయితే ఆ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసిన లక్ష్మి పార్వతి ఉద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా మీడియాలో కొన్ని వార్తలొచ్చాయి.

మరి తనని పాజిటివ్ గా చూపించి, ఎన్టీఆర్ చివరి దశలో పడిన అవస్థలను రామ్ గోపాల్ వర్మ సినిమా రూపంలో ప్రేక్షకులకు తెలియజెబుతాడని లక్ష్మి పార్వతి చాలా ఆశాపాడుతున్నట్లుగా నిన్న ట్రైలర్ చూసాక ఆమె కన్నీళ్లు చెబుతున్నాయని కొంతమంది అంటున్నారు. అందుకే వర్మ కి కావాల్సిన ఇంఫార్మేషన్ లక్ష్మి పార్వతి రహస్యంగా అందిస్తుందని అంటున్నారు. అయితే లక్ష్మి పార్వతికి రామ్ గోపాల్ వర్మ ఎంతవరకు ఫెవర్ చేస్తాడో అనేది ఇప్పుడు ఉన్న హాట్ టాపిక్. అందుకేనట ట్రైలర్ లో చూపించినట్టుగా లక్ష్మి పార్వతిని సినిమా మొత్తం పాజిటివ్ గా చూపిస్తాడా? లేదంటే వర్మ గత సినిమాల వలే అంటే వంగవీటి లాంటి సినిమాల్లో ట్రైలర్ లో ఒకలాగా, సినిమాలో మరోలా చూపించి బోల్తా కొట్టించినట్టుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉండబోతుందా?

సినిమా పూర్తయ్యి సినిమా చూసాక లక్ష్మి పార్వతి ఏం చేస్తుంది? లక్ష్మి పార్వతి ని హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ కి దగ్గరగా ఉన్నట్టుగా సినిమా మొత్తం చూపిస్తాడా? లేదంటే హైప్ పెంచడానికని ట్రైలర్ వరకే పరిమితం చేస్తాడా? మరి వంగవీటి అనుకూలంగా సినిమా తీస్తున్నాని చెప్పి… సినిమా విడుదలయ్యాక వంగవీటి రాధా తో గొడవపెట్టుకున్నట్లుగా…. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలయ్యాక లక్ష్మి పార్వతి కూడా వర్మ చూపించింది చూసి కన్నీళ్ళు పెట్టాల్సి వస్తుందేమో… సినిమా పూర్తయ్యి.. సెన్సార్ కి వెళ్లకముందే సినిమా చూసి ఓకె చెయ్యమని లక్ష్మి పార్వతికి సన్నిహితులు చెబుతున్నారట.

Tags:    

Similar News