అన్నగారిని అడ్డంగా ఇరికిస్తాడా?

Update: 2018-12-13 07:17 GMT

వామ్మో ఈ రాంగోపాల్ వర్మ అన్న గారిని అడ్డంగా ఇరికించేలా ఉన్నాడు. ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో గానీ వర్మ లెక్కలు చాలా తేడాగా ఉన్నాయి. లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ జీవితంలో ఏదో జరిగింది అన్న అనుమానం ఉంది అంటున్నాడు వర్మ. ఎప్పుడు కాంట్రవర్సీ కోరుకునే వర్మ... లక్ష్మీపార్వతిని మంచిగా చూపించడు. అన్న గారి ఫ్యామిలీ గురించి వర్మకు తెలిసింది గోరంత. వర్మ తెలుసుకోవాల్సింది కొండంత. అదేంటో సడన్ గా వర్మకే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చాడు. ఇప్పటిదాకా దేవుడు లేడనే వర్మ ఎన్టీఆర్ అనగానే దేవుడి దగ్గర పోయాడు.

వర్మకు డబ్బులు... జనానికి తిప్పలు

మామూలుగా చేసిన పాపం చెబితే పోతుంది కానీ వర్మ చేస్తున్న పాపం చెప్పుకున్నా పోదు ఇంకేం చేసినా పోదు. ఎందుకంటే వర్మ సినిమాలో వాస్తవం తక్కువ పులిహోర ఎక్కువ. తన సినిమాతో అన్న గారి ఆత్మ శాంతిస్తుందని వర్మ అంటున్నాడు. ఆ శాంతి సంగతేమోగానీ వర్మ చూపించే రంకు బొంకులు చిల్లర వేషాలు సగటు ప్రేక్షకుడికి ఎక్కడో కాలుద్ది. వర్మ సినిమా అంటేనే గ్యాంబ్లింగ్. విషయం తక్కువ విజువల్ ఎక్కువ. ఏదో ఊహించుకొని సినిమాకు వెళ్తే వర్మ చూపించేది ఇంకో రకంగా ఉంటుంది. కర్ర విరగదు పాము చావదు. వర్మకు డబ్బులు జనానికి తిప్పలు. అందుకనే వర్మ సినిమా అంటేనే స్టోరీ కి తక్కువ కామెడీ కి ఎక్కువ.

Similar News