ఈసారి ‘డబుల్ ఇస్మార్ట్’

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ నిన్ననే రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లు కలెక్ట్ చేస్తుంది. మొదటి [more]

Update: 2019-07-19 07:41 GMT

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ నిన్ననే రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లు కలెక్ట్ చేస్తుంది. మొదటి ఆట నుండే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈసినిమా మాస్ ఎంటర్టైనర్ అని చూస్తే అర్ధం అయిపోతుంది. రామ్ నటన హైలైట్ గా ఉందంటున్నారు. చాలా ఏళ్ళ తరువాత పూరి ఈసినిమాతో హిట్ కొట్టాడనే అనుకుంటున్నారు అంత.

ఇటు పూరి అటు తన గురువు రామ్ గోపాల్ వర్మ ఈ హిట్ తో మంచి హ్యాపీ గా ఉన్నారు. ఈనేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘హేయ్ పూరి.. త్వరగా ఇస్మార్ట్ శంకర్ 2 స్టార్ట్ చెయ్. ఈసారి డబుల్ దిమాక్ కాదు ట్రిపుల్ దిమాక్ ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు.

దానికి పూరి ఇలా రీట్వీట్ ఇచ్చారు…”ఆల్రెడీ ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ రిజిస్టర్ చేయించాను సర్” అని సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేసేశారు. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? అందులో హీరో రామేనా లేదా వేరే హీరోని పెట్టి చేస్తారా? అన్నది ఇంకా తెలియాల్సిఉంది. అయితే పూరి ఇస్మార్ట్ తరువాత ఏ మూవీ చేస్తాడో ఇంకా చెప్పలేదు. సో అంత ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తాడు అనుకుంటున్నారు. మరి పూరి ఏం ఆలోచించుకున్నాడో తెలియాలి

Tags:    

Similar News