అందుకే ఆ సినిమా ఆగిపోయింది..!

Update: 2018-10-17 09:38 GMT

ఎనర్జిటిక్ హీరో రామ్ స్క్రిప్ట్స్ ఎంచుకోడంలో కొంచం కొత్తగా ఆలోచిస్తుంటారు. అందుకే అతనికి సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. రెండు ఫ్లాప్స్... తర్వాత ఒక హిట్ అన్నట్లుగా సాగిస్తుంది రామ్ కెరీర్. ప్రస్తుతం రామ్ హీరోగా అనుపమ హీరోయిన్ గా త్రినాధరావు దర్శకత్వంలో 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా రేపు మన ముందుకు రానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతగా లేవు. కానీ దర్శకుడిపై హోప్స్ తో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి.

భారీ బడ్జెట్ కావడం వల్లే...

ఈ సినిమా ప్రొమోషన్స్ లో రామ్ మాట్లాడుతూ... ఈ సినిమా తప్పకుండా యూత్ కి కనెక్ట్ అవుతుందని చెప్పాడు. రోమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను డైరెక్టర్ బాగా తీర్చిదిద్దాడు. ఇక ఇంటర్వ్యూ లో ప్రవీణ్ సత్తారుతో సినిమా పట్టాలెక్కకపోవడం గురించి ఆయన ప్రస్తావించాడు. నేను ప్రవీణ్ తో ఓ మంచి సినిమా చేయాలనున్నానని.. అందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని.. కానీ భారీ బడ్జెట్ అవసరమవుతుందని, అందువలన ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పాడు. ఫ్యూచర్ లో ప్రవీణ్ తో కలిసి ఓ సినిమా కచ్చితంగా చేస్తా అని అన్నాడు రామ్.

Similar News