ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ తో రామ్ మూవీ..!

Update: 2018-10-01 06:51 GMT

దిల్ రాజు బ్యానర్ లో నక్కిన త్రినాధరావు డైరెక్షన్ లో రామ్ - అనుపమ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దసరా కానుకగా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందుకు సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

మల్టీస్టారర్ లో...

ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత హీరో రామ్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇది మల్టీస్టారర్ అని అర్ధం అవుతుంది. రామ్ తో పాటు మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నారట. కథ నచ్చడంతో దుల్కర్ వెంటనే ఓకే చేసాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Similar News