ప్రమోషన్స్ సూపర్.. మరి సినిమా!

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన వినయ విధేయరామ మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకులముందుకు రాబోతుంది. పక్క మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన్న వినయ విధేయరామ [more]

Update: 2019-01-11 01:30 GMT

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన వినయ విధేయరామ మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకులముందుకు రాబోతుంది. పక్క మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన్న వినయ విధేయరామ మీద బిసి సెంటర్స్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందులోను రామ్ చరణ్ మాస్ లుక్ తో పాటుగా రామ్ చరణ్ జిమ్ బాడీ, టాటూస్ వేయిన్చుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం.. మెగా అభిమానులు ఈ సినిమా మీద అంతగా అంచనాలు పెట్టుకోవడానికి కారణమవడం.. మొదటినుండి ఈ సినిమా మాస్ ఎంటెర్టైనర్ గా ఫోకస్ అవుతూనే వచ్చింది.

మరి నిర్మాత దానయ్య వినయ విధేయరామ ప్రమోషన్స్ కూడా వీర లెవల్లో చేసాడు. భారీ ప్రమోషన్స్ లో వినయ విధేయరామ అన్ని సినిమాలకన్నా ఒక అడుగు ముందే ఉంది. ఇక రామ్ చరణ్, కైరా అద్వానీ, బోయపాటి ఇలా వినయ విధేయరామ చిత్ర బృందం ప్రమోషన్స్ తో టాప్ లేపింది. ఇక ఛానల్స్ కి యాడ్స్ కానివ్వండి, వెబ్ మీడియాలో కానివ్వండి, ప్రింట్ మీడియాలో కానివ్వండీ ఎక్కడ చూసిన వినయ విధేయరామ యాడ్స్ దర్శనమివ్వడం.. సినిమా మీద భారీ హైప్ క్రియేట్ కి కారణమయ్యాయి. మరి భారీ ప్రమోషన్స్ తో దూసుకు పోయిన వినయ విధేయ సినిమా టాక్ ఎలా ఉంటుందో అనేది మరికాసేపట్లో తెలుస్తుంది. మరి సూపర్ ప్రమోషన్స్ తో ఉన్న వినయ విధేయరాముడు సినిమా పరంగా అంటే సూపర్ హిట్ అందుకున్నాడో లేదో చూద్దాం.

Tags:    

Similar News