నిర్మాతగా అంటే చాలా ఒత్తిడి భరించాలి.. కానీ హీరో అయితే..

ఒకప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్.. కానీ రాజకీయాలతో ఒక వెలుగు వెలుగుదామనిసినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవికి రాజకీయాలు చాచి చెంప మీద కొట్టాయి. [more]

Update: 2019-01-09 03:23 GMT

ఒకప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్.. కానీ రాజకీయాలతో ఒక వెలుగు వెలుగుదామనిసినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవికి రాజకీయాలు చాచి చెంప మీద కొట్టాయి. రాజకీయాల్లో మనలేక మళ్ళీ తొమ్మిదేళ్ల గ్యాప్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. చిరు క్రేజ్ ప్రేక్షకుల్లో అభిమానుల్లో పెద్దగా తగ్గలేదనేదే అందరి అభిప్రాయం. అందుకే ఆయన కొడుకు రామ్ చరణ్.. తండ్రి చిరు సినిమాలను నిర్మించి ఆయన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి తండ్రి నటించే సినిమాలను వరసగా నిర్మిస్తున్నాడు. హీరోగా, నిర్మాతగా చరణ్ బిజీ అయ్యాడు. అయితే తన తండ్రి సినిమాల విషయంలో బయట నిర్మాతలకే కాదు… ఆఖరుకి మేనమాఁవ అల్లు అరవింద్ కి కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు.

ఖైదీ నెంబర్ 150 ని భారీగా నిర్మించి భారీ లాభాలను దండుకున్నాడు రామ్ చరణ్. ఇక తాజాగా కొణిదెల బ్యానర్ పై భారీ అంటే 200 కోట్ల బడ్జెట్ తో సై రా నరసింహారెడ్డిని నిర్మిస్తున్నాడు చరణ్. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక సై రా నరసింహారెడ్డి తో రామ్ చరణ్ భారీగా లాభపడడం ఖాయం. ఎందుకంటే సై రా మీద ఇండియా వైడ్ గా భారీ క్రేజుంది. అలాగే సై రా ప్రీ రిలీజ్ లెక్కలు ఒక్కొక్కటిగా బయటికొచ్చి షాకిస్తున్నాయి. ఇక చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అంటే కొరటాల – చిరు కాంబోలో సినిమాని కూడా రామ్ చరణే కొణిదెల బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.

ఇక కొణిదెల ప్రొడక్షన్స్ లో తండ్రి సినిమాలే కాకుండా బయటి హీరోల సినిమాలు కూడా చరణ్ చేయబోతున్నాడనే టాక్ ఈ మధ్య వినబడుతుంది. అయితే వినయ విధేయరామ ఇంటర్వూస్ లో భాగంగా చరణ్ ని అడగగా… ఈ కొణిదెల బ్యానర్ పెట్టింది కేవ‌లం నాన్న‌గారి సినిమాలు నిర్మించడం కోస‌మే.. ఆఖరుకి నేను హీరోగా .. బ‌య‌టి బ్యాన‌ర్ల‌లోనే… బయట నిర్మాతలకు పనిచేస్తా. టాలీవుడ్ లో చాలా పెద్ద పేరున్న నిర్మాతలున్నారు. అందుకే నేను నా ఓన్ బ్యానర్ లో సినిమాలు చేసే అవ‌స‌రం లేదు. కేవలం నాన్న‌గారి సినిమాలు నేను మాత్రమే నిర్మించాలన్న స్వార్థంతోనే కొణిదెల ప్రొడక్ష‌న్స్ ప్రారంభించా. కానీ బ‌య‌టి హీరోల‌తో సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న లేదు…. అని చెప్పడమే కాదు.. నిర్మాతగా చాలా ఒత్తిడి ఉంటుంది.. ఒక పక్క హీరోగా…. మరోపక్క నిర్మాతగా కొనసాగడం చాలా కష్టమని చెబుతున్నాడు చరణ్.

Tags:    

Similar News