RRR గురించి చరణ్ ఏమన్నానంటే

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న #RRR సినిమా షూటింగ్ ని రాజమౌళి జెట్ స్పీడు తో చేస్తున్నాడు. 2020 జులై 30 టార్గెట్ [more]

Update: 2019-11-12 06:34 GMT

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న #RRR సినిమా షూటింగ్ ని రాజమౌళి జెట్ స్పీడు తో చేస్తున్నాడు. 2020 జులై 30 టార్గెట్ గా తెరకెక్కుతున్న #RRR సినిమా లో అల్లూరి పాత్రలో రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటిలో స్పెషల్ గా వేసిన సెట్స్ లో రామ్ చరణ్ పై రాజమౌళి సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సై రా బిజీ తర్వాత కూల్ గా #RRR షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ప్రస్తుతానికి ఎన్టీఆర్ #RRR షూటింగ్ లో పాల్గొనడం లేదు. త్వరలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబో సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలవుతుందని అంటునారు.

ఇక ఈరోజు ఉదయం రామ్ చరణ్ రామోజీ ఫిలింసిటీకి #RRR షూటింగ్ కోసం హాజరవుతూ మార్నింగ్ షూట్ రామోజీ ఫిలిం సిటీ అంటూ కార్ లో వెళ్తూ ఉన్న ఓ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇకపోతే రామోజీ ఫిలింసిటీలో రాజమౌళి, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకి సంబందించి సన్నివేశాల షూట్ లో నిమగ్నమై ఉన్నాడు. రామ్ చరణ్ తో పాటుగా వందల సంఖ్యలో పాల్గొంటున్న జూనియర్ ఆర్టిస్టులతో కోర్టు సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఆ కోర్టు సన్నివేశాల్లో అల్లూరి పాత్రలో ఉన్న రామ్ చరణ్ ని బ్రిటీషు న్యాయ‌స్థానం ప్ర‌శ్నించే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్టుగా సమాచారం

Tags:    

Similar News