వెంకీ హీరోగా.. చరణ్ సినిమా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన కత్తి రీమేక్ రైట్స్ తీసుకుని బ్లాక్ బస్టర్ [more]

Update: 2020-02-18 04:45 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన కత్తి రీమేక్ రైట్స్ తీసుకుని బ్లాక్ బస్టర్ ఖైదీ నెం 150 తో నిర్మాతగా అరంగేట్రం చేసాడు. అలాగే సై రా సినిమాని నిర్మించాడు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మరొకరి తో కలిసి తెలుగు స్ట్రయిట్ మూవీని తండ్రితో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరు కోసం రామ్ చరణ్ సేఫ్ సైడ్ గా మలయాళ సినిమా లూసిఫెర్ రీమేక్ రైట్స్ కొనేసాడు. ఆ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకముందే.. మరొక రీమేక్ ని రామ్ చరణ్ దక్కించుకున్నాడు

మలయాళ హిట్ డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రీమేక్ హక్కులను చరణ్ కొనేసాడు. అయితే ఈ రీమేక్ ని తండ్రి చిరుతోనే రామ్ చరణ్ రీమేక్ చేస్తాడని.. కాదు తానే హీరోగా నటిస్తాడని… కాబట్టి ఆ హక్కులను కొనినట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా రామ్ చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ సినిమా చూసిన వెంటనే.. ఈ సినిమాకి హీరో వెంకటేష్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని చరణ్ భావించాడని అందుకే ఆ రీమేక్ రైట్స్ కొన్నాడని.. కాకపోతే ఇంకా వెంకీ తో ఆ విషయం చరణ్ మాట్లాడలేదని అంటున్నారు. ఇక వెంకటేష్ ని సంప్రదించాక.. ఒక అగ్ర దర్శకుడితో ఆ సినిమాని రీమేక్ చేయించాలని చరణ్ భావిస్తున్నాడట. మరి ఇదంతా చూస్తుంటే చెర్రీకి నిర్మాత లక్షణాలు బాగానే వంటబట్టాయి అనిపిస్తుంది.

Tags:    

Similar News