రామ్ చరణ్ మద్దతు కూడా వచ్చేసింది

Update: 2018-04-19 03:02 GMT

పవన్ కళ్యాణ్ మీద శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలోని, మెగా ఫ్యామిలీలోను పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ని శ్రీ రెడ్డి నోటికొచ్చినట్లుగా మట్లాడడం కరెక్ట్ కాదని.... పవన్ ఫాన్స్ ఆమె అంతూ చూస్తామని హెచ్చరిస్తుంటే... పవన్ చిన్నన్న నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి మరి శ్రీ రెడ్డి ని ఎడా పెడా వాయించేసాడు. అలాగే మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడడమే కాదు... చాలామంది శ్రీ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ ని లగాడం ఏమిటంటూ విరుచుకుపడుతున్నారు. అయితే శ్రీ రెడ్డ్ కాస్త వెనక్కి తగి పవన్ కళ్యణ్ అమ్మగారికి క్షమాపణ చెప్పినా... ఆమెపై విరుచుకుపడేవారు ఎక్కువయ్యారు కానీ... ఎవ్వరు తగ్గడం లేదు.

ఇక నిన్నటినుండి మౌనం వహించిన రామ్ చరణ్ కూడా తన బాబాయ్ కి మద్దతుగా శ్రీ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్న టైప్ లో సోషల్ మీడియా లో ఘాటుగా స్పందించాడు.. రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా.. అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీ లో మహిళలలను ఎప్పుడూ అత్యంత గౌరవం తో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధం గా, సంస్కారవంతం గా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరం గా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనం గా ఉంటుంది. అంటూ ఘాటుగా స్పందించాడు.

Similar News