ఇద్దరి అభిమానులను ఎలా హ్యాండిల్ చేస్తావయ్యా

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు #RRR మూవీలో నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అంటే… మాములు విషయం కాదు. ఇద్దరు హీరోల అభిమానులను [more]

Update: 2019-11-09 07:56 GMT

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు #RRR మూవీలో నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అంటే… మాములు విషయం కాదు. ఇద్దరు హీరోల అభిమానులను సమానంగా సంతోష పెట్టాలి. లేదంటే రచ్చ రంబోలె. ఎవరి పాత్ర కొద్దిగా తగ్గినా రాజమౌళికి తడిసిపోతుంది. అయితే అదంతా సినిమా విడుదలయ్యాక సంగతి. తాజాగా రాజమౌళికి మరో టెన్షన్ పట్టుకుంది. అది రామ్ చరణ్ అల్లూరి లుక్ ముందు వదిలితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హార్ట్ అవుతారు. అలాగే ఎన్టీఆర్ కొమరం బీమ్ లుక్ ముందు వదిల్తే మెగా ఫాన్స్ హార్ట్ అవుతారు.

అందుకే గతంలో #RRR ప్రెస్ మీట్ రోజున ఇద్దరిని కలిపి నీరు, నిప్పులా ఒకే ఫ్రెమ్ లో దించాడు రాజమౌళి. ఎవరి ఫ్యాన్స్ ని హార్ట్ కానివ్వకుండా ఒకే ఫ్రేమ్ లో స్టార్ హీరోల పాత్రలను రివీల్ చేసాడు. తాజాగా మరోసారి లుక్స్ వదిలినప్పుడు రాజమౌళి ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో అనేదానిమీద ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది విడుదల కాబోయే ఈ సినిమా లుక్స్ ని చరణ్ బర్త్ డే రోజున అల్లూరి గా చరణ్ లుక్ ని, ఎన్టీఆర్ బర్త్ డే రోజున కొమరం భీం ఎన్టీఆర్ లుక్ ని రివీల్ చెయ్యాలని రాజమౌళి భావిస్తున్నాడట. మరి ఎన్టీఆర్ కన్నా ముందే చరణ్ బర్త్ డే వస్తుంది. మరి ఎన్టీఆర్ కన్నా ముందు చెర్రీ లుక్ విడుదల చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అనే మీమాంసా రాజమౌళి లో ఉందని…. అందుకే చరణ్ పుట్టిన రోజుకి ఎన్టీఆర్, చరణ్ లుక్స్ రెండిటిని విడుదల చేసి, ఎన్టీఆర్ పుట్టిన రోజుకి టీజర్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్.

Tags:    

Similar News