హీరోయిన్ ని పొగిడేస్తున్న మెగా హీరో..!

భరత్ అనే నేనుతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ.. వెంటనే మరో స్టార్ హీరో రామ్ చరణ్ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యి [more]

Update: 2019-01-08 09:06 GMT

భరత్ అనే నేనుతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ.. వెంటనే మరో స్టార్ హీరో రామ్ చరణ్ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. మంచి ఒడ్డు పొడుగు, గ్లామర్ పరంగా ఎటువంటి హద్దులు పెట్టుకొని కైరా అద్వానీ టాప్ స్టార్స్ సినిమాల్లో వరుసగా ఆఫర్స్ పట్టేస్తుంది. తాజాగా రామ్ చరణ్ తో కలిసి నటించిన వినయ విధేయ రామ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కైరా నటన, డ్యాన్స్ అద్భుతమని చెబుతున్నాడు రామ్ చరణ్. టాలీవుడ్ టాప్ డాన్సర్స్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ముందు వరసలో ఉంటారు.

కైరాతో డ్యాన్స్ చేస్తే…

అలాంటి రామ్ చరణ్ కి పర్ఫెక్ట్ డాన్స్ పార్టనర్ కైరా అద్వానీయే అని అంటున్నాడు రామ్ చరణ్. గతంలో రచ్చ సినిమాలో తమన్నాతో చేసినప్పుడు వచ్చిన కిక్ మళ్ళీ ఇన్నాళ్ళకి వినయ విధేయ రామలో కైరాతో చేస్తుంటే వచ్చిందని అంటున్నాడు ఈ మెగా హీరో రామ్ చరణ్. కైరా అద్వానీ డ్యాన్స్ ని బాగా ఎంజాయ్ చేసానని.. కైరా అద్వానీకి ఉండే పెద్ద కళ్ళు ఆకట్టుకునేలా ఉంటాయని… అలాగే ఏ సీన్ లోనైనా ఎక్సప్రెషన్స్ తో చంపేస్తుందని చెప్పిన చరణ్.. కైరా అద్వానీది పెద్ద ఫ్యామిలీ కాబట్టి.. తమ ఫ్యామిలీతో కైరా చాలా త్వరగా కలిసిపోయింది చెబుతున్నాడు.

ఉపాసనతో ఫ్రెండ్షిప్

అలాగే కైరా అద్వానీ తన భార్య ఉపాసన మంచి ఫ్రెండ్స్ అయ్యారని.. అలా కైరా వినయ విధేయ రామతో తమకు మంచి ఫ్రెండ్ అయ్యిందని అంటున్నాడు. మరి తనతో పాటుగా నటించే హీరోయిన్స్ ఏ హీరో అయినా ఈ విధంగానే పొగుడుతుంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం కైరా అద్వానీని కాస్త ఎక్కువ పొగిడాడట అనిపిస్తుంది కదూ…!

Tags:    

Similar News