సిద్ద – నీలాంబరి లుక్ లో ఆచార్య

చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మే 13 న విడుదలకు సిద్దమవుతుంది. కరోనా కారణంగా షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే [more]

Update: 2021-04-14 06:40 GMT

చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మే 13 న విడుదలకు సిద్దమవుతుంది. కరోనా కారణంగా షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే అనుకున్న టైం కే ఆచార్య వచ్చేస్తుంది. ఇకపోతే ఆచార్య సినిమాలో చిరు తో పాటుగా రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. తండ్రి కొడుకుల మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ద గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా చరణ్ పుట్టిన రోజున ఆచార్య నుండి సిద్ద లుక్ ని రివీల్ చేసిన టీం ఉగాది రోజున సిద్ద ని తన ప్రేమికురాలితో రొమాంటిక్ గా రివీల్ చేసింది. ఆచార్య లో రామ్ చరణ్ సిద్ద పాత్రకి జోడిగా టాప్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుంది.

సిద్ద – నీలాంబరి పాత్రధారి పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ ని ఉగాది కానుకగా రిలీజ్ చేసింది ఆచార్య టీం. రామ్ చరణ్ మెడలో రుద్రాక్ష మాలతో వైట్ టి షర్ట్ తో పూజ హెగ్డే ని అలా రొమాంటిక్ గా పట్టుకుని ఉన్న పోస్టర్ క్యూట్ గా రొమాంటిక్ గా ఉంది. పూజ హెగ్డే కూడా కాస్త డీ గ్లామర్ గా అనిపిస్తూ ఓల్డ్ లుక్ లో కనిపిస్తుంది. సారీ లో పూజ హెగ్డే నీలాంబరిగా చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. రామ్ చరణ్ తో ఫస్ట్ టైం ఇంత రొమాంటిక్ గా పూజ హెగ్డే నటించడం. గతంలో చరణ్ తో రంగస్థలం లో ఓ ఐటెం సాంగ్ లో పూజ హెగ్డే స్టెప్స్ వేసినా.. ఆచార్య లో వీళ్లది ఫ్రెష్ జోడిగా కనిపిస్తుంది. ఆచార్యలో చరణ్ – పూజ కాంబో పై ఫాన్స్ లో మంచి అంచనాలున్నాయి.

Tags:    

Similar News