రాజమౌళి వలలో గిలగిలా కొట్టుకుంటున్నారా?

రాజమౌళి తో సినిమా అంటే… హిట్టుకి హిట్టు.. తలపోటుకి తలపోటు. ఒక్కసారి రాజమౌళి వలలోకి వెళ్లారంటే.. చేపల మాదిరి కొట్టుకోవాల్సిందే. అంటే రాజమౌళి తో సినిమా వ్యవహారం [more]

Update: 2020-02-18 09:44 GMT

రాజమౌళి తో సినిమా అంటే… హిట్టుకి హిట్టు.. తలపోటుకి తలపోటు. ఒక్కసారి రాజమౌళి వలలోకి వెళ్లారంటే.. చేపల మాదిరి కొట్టుకోవాల్సిందే. అంటే రాజమౌళి తో సినిమా వ్యవహారం మాటలు కాదు.. తెలుగు భాషలోనే సినిమా అయితే రాజమౌళి చెప్పిన టైం కి సినిమా అందించేస్తాడు. పాన్ ఇండియా మూవీ అయితే రాజమౌళి కే తెలియదు ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో… అయితే ఆ సినిమా వలన హీరోలకు ఫేమ్ అయితే వస్తుంది కానీ.. తమ విలువైన సమయాన్ని మాత్రం కోల్పోతారు. డబ్బుకి డబ్బు, క్రేజుకి క్రేజు వచ్చాక మిగతావన్నీ లెక్క కాదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం తమ హీరోలు మరీ రెండేళ్లు లాకావడం ఒప్పుకోలేకపోతున్నారు. ప్రభాస్ రెండేళ్ళని… ఐదేళ్లు ఇరుక్కున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏడాదిన్నర అని రెండేళ్ళకి ఇరుక్కున్నారు.

రాజమౌళి చేసిన పనికి తమ నెక్స్ట్ సినిమా విషయంలో ఎన్టీఆర్, చరణ్ ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. RRR జులై 30 న విడుదలైతే… ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది మధ్యలో పట్టాలెక్కేది. కానీ RRR జనవరి కి వెళ్లేసరికి ఇప్పుడు త్రివిక్రమ్ మరో హీరో కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాడు. మరోపక్క ఎన్టీఆర్ తో చెయ్యడానికి నలుగురైదుగురు డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు. ఎన్టీఆర్ ఎవరికీ ఓకె చెప్పలేని స్థితి. రామ్ చరణ్ పలు హిట్ సినిమాల రీమేక్ రైట్స్ కొంటున్నాడు. కానీ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వడం లేదు. రాజమౌళి ఈ ఇద్దరి హీరోలను ఎప్పుడు వదులుతాడో అప్పుడే ఈ హీరోలిద్దరు తమ నెక్స్ట్ సినిమా విషయాలు బయటపెడతారు. కానీ రాజమౌళి ఈ ఇద్దరిని ఈ ఏడాది చిఎవరి వరకు వదిలే సీన్ లేదని తెలుస్తుంది. మరి ఎన్టీఆర్, చరణ్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మేషన్ కోసం మరో ఏడాది ఎదురు చూడాల్సిందే.

Tags:    

Similar News