#RRR ని ఏం చేసావ్ చరణ్

రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి భారీ బడ్జెట్ తో #RRR మూవీ ని ఎంతో అట్టహాసంగా మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ ని దిగ్విజయంగా పూర్తి [more]

Update: 2019-05-30 04:13 GMT

రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి భారీ బడ్జెట్ తో #RRR మూవీ ని ఎంతో అట్టహాసంగా మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ ని దిగ్విజయంగా పూర్తి చేసాడు. ఇక సెకండ్ షెడ్యూల్ కూడా జరుగుతుంది అనుకుంటే.. చరణ్ కాలికి గాయం, ఎన్టీఆర్ చేతికి గాయమవడంతో రాజమౌళి #RRR సినిమా షూటింగ్ కి బ్రేకిచ్చిన.. గ్రాఫిక్స్ పనుల్లో మాత్రం బిజీగా వున్నాడు. #RRR టీం తో కలిసి రాజమౌలి #RRR సినిమా షూటింగ్ విషయాలతో తలమునకలయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గాయం ఓ కొలిక్కి రావడంతో.. #RRR షూటింగ్ మళ్ళీ మొదలెట్టబోతున్నారనే సమాచారం ఉంది.

ఇక చరణ్ మాత్రం ఎప్పుడు #RRR షూటింగ్ లో జాయిన్ అవుతాడో క్లారిటీ లేదు. అందుకే చరణ్ వైఫ్ ఉపాసనతో కలిసి విదేశీ ట్రిప్స్ లో వేసవి వెకేషన్స్ ని జాలిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ జంట ఆఫ్రికా ఖండంలో జీవవైవిధ్యానికి పేరుగాంచిన టాంజానియా లోని సెరెంగెటి నేషనల్ పార్క్ కి వెళ్ళింది. అక్కడ వైల్డ్ యానిమల్స్ ని దగ్గరగా చూస్తూ ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తున్న విషయం ఉపాసన ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి చరణ్ కాలి గాయం ఇంకా పూర్తిగా మానినట్టు అనిపించడం లేదు. ఆ వీడియో లో చరణ్ కాలు చాపుకుని రిలాక్స్డ్ గా కూర్చోవడం చూస్తుంటే కాలి గాయం మానలేదనిపిస్తుంది. మరి భార్యతో టూర్ బాగానే ఎంజాయ్ చేస్తున్న చరణ్ #RRR షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడు చూడాలి.

Tags:    

Similar News