జక్కన్న ఈసారి తేడా కొట్టేలా ఉంది

ఎన్టీఆర్ – రామ్ చరణ్ తో భారీ బడ్జెట్ తో భారీ మొత్తంలో రాజమౌళి RRR తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఉగాది కానుకగా RRR టైటిల్ రివీల్ చేసారు. [more]

Update: 2020-03-26 06:12 GMT

ఎన్టీఆర్ – రామ్ చరణ్ తో భారీ బడ్జెట్ తో భారీ మొత్తంలో రాజమౌళి RRR తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఉగాది కానుకగా RRR టైటిల్ రివీల్ చేసారు. ఉగాది రోజున అందరూ కరోనా వలన తమ సెలెబ్రేషన్స్ ని ఆపుకుంటే.. రాజమౌళి మాత్రం RRR టైటిల్ ని రివీల్ చేసాడు. రామ్ చరణ్ ని రౌద్రంగా అగ్ని జ్వాలల మధ్యన చూపించగా… ఎన్టీఆర్ ని రుధిరంగా నీటి బిందువులుగా చూపించాడు. నిప్పు – నీరు కలిస్తే అనే కాన్సెప్ట్ తోనే RRR తెరకెక్కుతుంది అనేది RRR లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ పాత్రలు చూస్తే తెలుస్తుంది. రౌద్రం రణం రుధిరం అంటూ ఐదు భాషలకు కలిపి టైటిల్ ని ఫిక్స్ చేసాడు జక్కన్న.

అయితే జక్కన్న టైటిల్ మీనింగ్ చెబుతూ RRR టైటిల్ ని రివీల్ చేసాడు కానీ… ఈ టైటిల్ అన్ని భాషలకు రీచ్ అవుతుందా అనేది ఇప్పుడున్న అతి పేద ప్రశ్న. రాజమౌళి గత సినిమాల టైటిల్స్ ఇలా బయటికి రాగానే అలా ట్రెండ్ అయ్యేవి. ఇప్పుడు ఈ రౌద్రం – రణం – రుధిరం టైటిల్ కూడా ట్రేండింగ్ లోనే ఉంది.. కానీ ఈ టైటిల్ అనుకున్నంతగా ప్రేక్షకులకు రీచ్ కావడం లేదనేది తాజా న్యూస్. ఈసారి RRR టైటిల్ విషయంలో జక్కన్నకి తేడా కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. ఇక రాజమౌళి ఈసారి ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడో అంటూ అప్పుడే రౌద్రం రణం రుధిరం పోస్టర్ చూసి మిగతా సినిమాలను వెతికేస్తున్నారు జనాలు. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ లో మరేదన్నా సినిమా టైటిల్ పోలికలు కనబడతాయేమో అనే క్యూరియాసిటీ జనాల్లో బాగా ఉంది

Tags:    

Similar News