#RRR అప్ డేట్

రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం #RRR షూటింగ్ లో ఇద్దరూ హీరోల కు గాయాలు అవ్వడంతో కొన్ని రోజులు షూటింగ్ కి [more]

Update: 2019-06-03 07:33 GMT

రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం #RRR షూటింగ్ లో ఇద్దరూ హీరోల కు గాయాలు అవ్వడంతో కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసారు. ఇద్దరూ గాయాల నుండి రీసెంట్ గా కోలుకోవడంతో రాజమౌళి వీరిపై పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.

రాజమౌళి సినిమాల్లో ఫైట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ప్రతి ఫైట్ సీక్వెన్స్ చిన్న సైజు యుద్ధంలా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో రాత్రివేళల్లో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే రంగంలోకి దిగగా, కుటుంబంతో కలిసి ఇటీవలే విదేశీ పర్యటనని ముగించుకొని వచ్చిన చరణ్‌ కూడా త్వరలోనే చిత్రబృందంతో కలవనున్నారు.

దాదాపు రూ.300 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. 2020 జులై 30 న ఈమూవీ మన ముందుకు రానున్న సంగతి కూడా తెలిసిందే.

Tags:    

Similar News