సాహో తో బాలీవుడ్ ని దింపితే.. RRR తో హాలీవుడ్ ని దింపాడు

ప్రభాస్ – సుజిత్ లు సాహో సినిమాని ఇండియా వైడ్ క్రేజ్ కోసం… పేరున్న బాలీవుడ్ నటులనే ఎక్కువ తీసుకున్నారు. హీరోయిన్ శ్రద్ద కపూర్ దగ్గరనుండి…. విలన్స్ [more]

Update: 2019-11-23 06:20 GMT

ప్రభాస్ – సుజిత్ లు సాహో సినిమాని ఇండియా వైడ్ క్రేజ్ కోసం… పేరున్న బాలీవుడ్ నటులనే ఎక్కువ తీసుకున్నారు. హీరోయిన్ శ్రద్ద కపూర్ దగ్గరనుండి…. విలన్స్ వరకు బాలీవుడ్ నటులే ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఎక్కడా తగ్గకుండా రూపొందించారు. సాహో సినిమాకి బాలీవుడ్ నటులే ప్రధాన ఆకర్షణ అనుకున్నప్పటికీ.. సినిమా చూసాక అసలు ప్రభాస్ అండ్ టీం బాలీవడ్ నటులను ఎందుకు తీసుకున్నారో అర్ధం కాలేదు. ఎందుకంటే వారికి సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదు.

అయితే సాహో కోసం భారీ మొత్తానికి బాలీవుడ్ నటులు దిగితే.. ఇపుడు రాజమౌళి #RRR కోసం ఏకంగా హాలీవుడ్ నటులనే తీసుకొస్తున్నాడు. మరి #RRR సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడం, కొమరమ భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలతో సినిమా నడవడంతో.. అల్లూరి, కొమరం భీం బ్రిటిష్ వారితో యుద్ధం చేసిన నేపథ్యంలో రాజమౌళి ఇలా హాలీవుడ్ నటులను తీసుకోవడం జరిగిందని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ హీరోయిన్ దగ్గరనుండి, విలన్స్ వరకు హాలీవుడ్ నటులతోనే #RRR నిండిపోయిందని, వారి కోసం రాజమౌళి భారీగా వెచ్చించాడని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ అజయ్ దేవగన్, తమిళ సముద్రఖని దగ్గరనుండి హాలీవుడ్ వరకు రాజమౌళి సినిమా విస్తరించింది కాబట్టే… #RRR ని 10 భాషల్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరి సినిమాల విషయంలో నటీనటులతోనే సినిమాపై సగం క్రేజ్ వస్తుందని రాజమౌళి సినిమాల ద్వారానే తెలుస్తుంది. ఇక హాలీవుడ్ నటుల్ని సాహో లా ఏ గెస్ట్ రోల్స్ కో పరిమితం చెయ్యకుండా వారిని రాజమౌళి ఎలా వాడాలో అలా వాడేస్తాడని అంటున్నారు

Tags:    

Similar News