రాజమౌళి మీద పగ పట్టిన ఫాన్స్?

RRR హైలెట్స్ అంటూ ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వినడమే తప్ప రాజమౌళి మీడియా ముందుకు వచ్చి RRR అప్ డేట్స్ ఇవ్వడం లేదు. అందుకే [more]

Update: 2020-02-15 10:23 GMT

RRR హైలెట్స్ అంటూ ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వినడమే తప్ప రాజమౌళి మీడియా ముందుకు వచ్చి RRR అప్ డేట్స్ ఇవ్వడం లేదు. అందుకే ఫ్యాన్స్ ఎక్కడ దొరికితే అక్కడ RRR హీరోస్ లుక్స్ కానీ, వీడియోస్ కానీ లీక్ చేసి జక్కన్నకి వరసగా షాక్స్ ఇస్తున్నారు. జక్కన్న ఎంతగా RRR షూటింగ్ విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేసి ఫోన్స్ లాంటివి ఎలోవ్ చెయ్యకపోయినా.. ఏదో ఒక దారిలో RRR న్యూస్ లు సోషల్ మీడియాకి వచ్చి చేరుతున్నాయి. అంటే జక్కన్న మీద ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కలిపి హోల్సేల్ గా పగబట్టారన్నమాట.

ఇప్పటికే ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ దగ్గరనుండి… ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాల వరకు లీక్ చేసేసారు. అప్పటినుండి జక్కన్న జాగ్రత్త ఎక్కువైంది. అయినా ఊరుకోకుండా రాజమౌళి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే RRR హైలెట్స్ లో ఎన్టీఆర్ – పులి యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ అనే న్యూస్ ఉంది. తాజాగా మరో సీన్ సినిమాకే కాదు. ఫ్యాన్స్ కి కూడా హైలెట్ అనేలా ఉందని.. ఓ జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేసేసాడు. అదేమంటే అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ – కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ కి మధ్యన హోరాహోరీ ఫైట్ ఉంటుంది అని… దాన్ని భీమ్ – రామ్ ఫైట్ అంటూ ఇద్దరి మధ్యన గూస్ బంబ్స్ వచ్చే సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. దాదాపు రెండు వారాలుగా పైగా రాజమౌళి ఈ ఫైట్ సీన్స్ షూట్ చేసారట. ఈ యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకమైన సెట్లు వేసి సీన్ కూడా ఔట్ డోర్ లో షూట్ చేసినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News