ఈ సినిమాలో ఆ సీన్లు దుమ్మురేపుతాయా..?

Update: 2018-06-16 06:22 GMT

రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ ఇందులో చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ సెట్ వేసి అక్కడ గత మూడు వారాల నుండి ఫైట్ సీన్స్‌ కి సంబంధించి షూటింగ్ జరుపుతున్నారు. చరణ్ పై భారీ లెవెల్ లో యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇంటర్వెల్ ముందు, అలానే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్స్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ అని యూనిట్ చెబుతున్నమాట.

దసరాకు ప్రేక్షకుల ముందుకు...

ఈ రెండు ఫైట్స్ సినిమాలో హైలైట్ అవుతాయి అని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ విదేశాలు వెళ్లనుంది. అక్కడ కొన్ని సాంగ్స్ ను చిత్రీకరించనున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో వివేక్‌ ఒబెరాయ్, తమిళ్ సీనియర్ హీరో ప్రశాంత్, స్నేహాలు కీలకపాత్రలలో నటిస్తున్నారు. దసరా టైంకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.

Similar News