చరణ్ కూడానా?

Update: 2018-12-23 09:28 GMT

మెగా స్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత చేసిన చిత్రం కు మంచి వసూల్ రావడంతో రామ్ చరణ్ కొంచం సాహసం చేసి చిరంజీవి తో స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ను తెరకెక్కిస్తున్నాడు. 'సైరా' చిత్రంను సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా తరువాత చిరు తన నెక్స్ట్ మూవీ ని కూడా లైన్ లో పెట్టేసాడు.

రైటర్ కం డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో చిరు ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించి కొరటాల స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవలే మరో ఆసక్తికరమైన వార్త కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కొరటాల రాస్తున్న స్క్రిప్ట్ లో రామ చరణ్ కోసం ఒక కీలకమైన పాత్రని కూడా రాసుకున్నాడని... ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో చరణ్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు కొరటాల సన్నిహితులు. కొరటాల కేవలం మెగాస్టార్ ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఇది రూమర్ మాత్రమే అని అంటున్నారు. 'సైరా' తరువాత కొరటాల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రామ్ చరణ్ ఈసినిమాను నిర్మించనున్నారు. మిగిలిన డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి.

Similar News