ఆ బ్యాచ్ తో చెర్రీకేం పని

నిన్న అది వారం మెగాస్టార్ చిరు కొత్తింట్లో… 80 స్ బ్యాచ్ మాములు హంగామా చెయ్యలేదు. ఈసారి హోస్ట్ చిరు కాగా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ [more]

Update: 2019-11-25 09:06 GMT

నిన్న అది వారం మెగాస్టార్ చిరు కొత్తింట్లో… 80 స్ బ్యాచ్ మాములు హంగామా చెయ్యలేదు. ఈసారి హోస్ట్ చిరు కాగా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ లోని అగ్రతారలంతా ఈ పార్టీలో సందడి చేశారు. చిరు ఇచ్చిన 80 స్ పార్టీ పిక్స్ ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. సీనియర్ హీరోయిన్స్ అంతా చిరు ఇచ్చిన ఆ పార్టీలో రచ్చ రచ్చ చెయ్యడమేగాక.. సెల్ఫీస్ తో భీబత్సం చేశారు. నాగార్జున, వెంకటేష్ ఇలా ఎవ్వరు తగ్గకుండా ఆ పార్టీని ఎంతెలా ఎంజాయ్ చేసారో బయటికొచ్చిన పిక్స్ తోనే తెలుస్తుంది. చిరుని మధ్యలో నిలబెట్టి ఖుష్బూ, సుహాసిని వారంతా కలిసి ఇచ్చిన ఫోటో ఫోజ్ చూస్తే ఈ పార్టీ మాములుగా లేదు… ఓ రేంజ్ లో ఉందనిపిస్తుంది.

అయితే 80 స్ బ్యాచ్ లో ఇప్పుడు రామ్ చరణ్ కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. మెగాస్టార్ చిరు ఇంట్లో పార్టీ కాబట్టి అయన కొడుకు రామ్ చరణ్ అక్కడ ఉండడం పెద్ద విషయం కాదు గాని, రాంచరణ్ కూడా సీనియర్ హీరోయిన్స్ తో కలిసి సెల్ఫీలకు ఫోజివ్వడం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఖుష్బూ తో రామ్ చరణ్ సెల్ఫీ దిగడం చూసిన వారు చెర్రీకి ఆ 80 స్ బ్యాచ్ పార్టీలో ఏం పని అంటూ సరదాగా అంటున్నారు. మరి చిరు తన బ్యాచ్ ని వేసుకుని హంగామా చేస్తుంటే… ఆ పార్టీ ఏర్పాట్లు చూసుకోవాల్సింది చెర్రీనే కదా. అలా చరణ్ ఆ పార్టీలో భాగమయ్యాడన్నమాట

Tags:    

Similar News