చరణ్ ఇంత కష్టం ఎలా తట్టుకుంటాడో..?

Update: 2018-11-29 11:00 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సినిమా బాధ్యతలు ఎక్కువ అయిపోయాయి. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న 'వినయ విధేయ రామ' షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే #RRR కు రెడీ అయి యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నాడు. దాదాపు 30 రోజుల పాటు జరిగే ఈ యాక్షన్ ఎపిసోడ్ ముగియగానే వెంటనే చరణ్ 'వినయ విధేయ రామ'లో ఐటెం సాంగ్ పూర్తి చేయాలి. ఆ పాట కంప్లీట్ అయిన వెంటనే #RRR నెక్స్ట్ షెడ్యూల్ తో బిజీ అయిపోతాడు.

మరోవైపు నిర్మాణ బాధ్యతలు కూడా

మరోవైపు రామ్ చరణ్ లేటెస్ట్ గా నిర్మాణ బాధ్యతలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150 'తో తన సొంత బ్యానర్ ను స్టార్ట్ చేసాడు చరణ్. 'సైరా' చిత్రం కూడా ఇదే బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. 'సైరా' సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా చాలా అవ్వాల్సి ఉంది. ఇంతవరకు పాటలు కూడా చిత్రీకరించలేదు. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ చరణ్ చూసుకోవాలి.

ఒకేసారి నాలుగు సినిమాల బాధ్యతలు

అలానే కొరటాల మెగా స్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, మిగిలిన పనులఅన్నీ చరణే చూసుకోవాలి. అంటే మొత్తం నాలుగు సినిమాల బాధ్యతలు చరణ్ మోస్తున్నాడు. ఒకేసారి ఇంత ప్రెజర్ ని ఎలా తట్టుకుంటున్నాడో అంటున్నారు ఫ్యాన్స్. చిరుకి మించి ఎక్కువ కష్టపడుతున్నాడని తన దగ్గర సన్నిహితులు అంటున్నారు.

Similar News