వారం గ్యాప్ తో చరణ్ రెండు సినిమాలా..?

కెరీర్ పరంగా మంచి ఊపు మీద ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. తొలిసారిగా మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ [more]

Update: 2018-12-28 08:17 GMT

కెరీర్ పరంగా మంచి ఊపు మీద ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. తొలిసారిగా మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటిస్తున్నాడు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. చరణ్ లో మాస్ ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేస్తూ బోయపాటి చరణ్ ను బాగా చూపించాడు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ కథానాయకుడిగా తెలుగులో వచ్చిన ‘రంగస్థలం’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

వారం రోజుల గ్యాప్ లోనే రెండు సినిమాలు

అయితే ఈ సినిమాను కేరళలో రిలీజ్ చేయాలని చేస్తున్నారు. వచ్చే నెల జనవరి 18వ తేదీన ఈ సినిమాను అక్కడ భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ‘వినయ విధేయ రామ’ తెలుగులో సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన వస్తుంటే ‘రంగస్థలం’ కేరళ వర్షన్ వారం గ్యాప్ తో రిలీజ్ కానుంది. ‘వినయ విధేయ రామ’ని కూడా కేరళలో విడుదల చేయనున్నారు మేకర్స్. అక్కడ జనవరి 25వ తేదీన విడుదల చేయనున్నారు. చాలా తక్కువ గ్యాప్ తో మలయాళ ప్రేక్షకుల ముందుకు చరణ్ రెండు సినిమాలు రావడం విశేషం. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఇంతకు మించి ఏం కావాలి.

Tags:    

Similar News