పిక్ టాక్: మాస్టర్ చెఫ్... మిస్టర్ సీ

Update: 2018-04-18 11:23 GMT

రంగస్థలం సినిమా హిట్ తో రామ్ చరణ్ ఫుల్ హ్యాపీ. మగధీర తర్వాత ఆ స్థాయిలో అంతటి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ నిజంగానే సంతోషంగా వున్నాడు. రంగస్థలం కోసం ఏడాది కాలం గెడ్డంతో కష్టపడుతూ ఉన్న రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి సినిమా #RC12 కోసం రెడీ అవుతున్నాడు. అయితే రంగస్థలం సినిమా విడుదల తర్వాత పూర్తిగా ఫ్రీ అయిన రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపాసన కొణిదెలతో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న రామ్ చరణ్ తన భార్య కోసం, ఫ్యామిలీ కోసం పూర్తిగా టైం కేటాయించేసాడు.

మరి ఈ ఖాళీ టైం రామ్ చరణ్ ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా.... తన భార్య ఉపాసన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి పెడుతున్నాడు. మరి చరణ్ తన కోసం బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటే.. ఉపాసన మాత్రం చరణ్ వంట గదిలో బ్రేక్ ఫాస్ట్ చేసే ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడమే కాదు.. మాస్టర్ చెఫ్... మిస్టర్ సీ... హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ను మా కోసం చేస్తున్నాడు... అంటూ ఫన్నీగా క్యాప్షన్ కూడా పెట్టింది. మరి చరణ్ ఇలా ఫన్నీగా ఫ్యామిలీ కోసం వంటలు చేస్తూ తన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక బోయపాటి సినిమా కోసం రామ్ చరణ్ రేపు 21 నుండి సెట్స్ మీదకెళ్ళబోతున్నాడు. ఇప్పటికే బోయపాటి సినిమాలో తన లుక్ ని పూర్తిగా మర్చుకోవడం కోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ రాకేష్ ఉదియర్ సమక్షంలో జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు.

Similar News