సానియా మీర్జా చెల్లి పెళ్ళిలో రామ్ చరణ్ రచ్చ

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెటర్ అజారుద్దీన్ కుమ్మరుడి వివాహం హైదరాబాద్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ పెళ్లికి అటు అజారుద్దీన్, ఇటు సానియా మీర్జా అతికొద్దిమంది [more]

Update: 2019-12-15 06:19 GMT

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెటర్ అజారుద్దీన్ కుమ్మరుడి వివాహం హైదరాబాద్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ పెళ్లికి అటు అజారుద్దీన్, ఇటు సానియా మీర్జా అతికొద్దిమంది సన్నిహితులని ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, చుట్టాలు, సన్నిహితుల మధ్యన సానియా మీర్జా చెల్లి వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లి కి రామ్ చరణ్ సతి సమేతంగా ఉపాసన తో హాజరయ్యాడు. అజార్ తో, సానియా తో రామ్ చరణ్ అండ్ వైఫ్ ఉపాసనలు సరాదాగా ఫొటోస్ కి ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కడుతున్నాయి ఇక బాలీవుడ్ నుండి ప్రముఖ కొరియో గ్రాఫేర్, దర్శకురాలు ఫరా ఖాన్ కూడా హాజరయ్యింది. రామ్ చరణ్ తో ఫరా ఖాన్ సెల్ఫీ దిగడమే కాదు.. మై న్యూ ఫ్రెండ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

అయితే ఈ పెళ్ళిలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన రామ్ చరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ సానియా మీర్జా, ఫరా ఖాన్ తో స్టేజ్ మీద వేసిన స్టెప్స్ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామ్ చరణ్ తో పాటు సానియా మీర్జా మరియు దర్శకురాలు ఫరా ఖాన్ లు డాన్స్ చేస్తూ అందరిని ఉర్రుతలూగించారు. మరి రామ్ చరణ్, సానియా, ఫరా ఖాన్ కలిసి ఎంజాయ్ చేస్తూ వేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. రామ్ చరణ్ అభిమానులైతే చరణ్ ఎక్కడున్నా డాన్స్ కింగ్ అంటూ పండగ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News