రామ్ చరణ్ నిర్మాతగా పర్ఫెక్ట్ అనాలి

Update: 2018-12-19 02:55 GMT

స్టార్ హీరోగా.. నిర్మాతగా రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చెయ్యని సాహసం చేస్తున్నాడు. ఒక వైపు హీరోగా సినిమా షూటింగ్ మరో వైపు నిర్మాతగా మరో సినిమా షూటింగ్. రెండిటీని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక నిర్మాతగా మారిన తర్వాత ఒక్కో సినిమా బడ్జెట్ పరిమితులుదాటకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పరిమితి దాటి బడ్జెట్ పెడితే.. సినిమా టాక్ లో తేడా వస్తే నిర్మాతలు ఎంత బాధపడాల్సి వస్తుందో నిర్మతగానే కాదు.. చాలామంది నిర్మాతలను రామ్ చరణ్ చూస్తున్నాడు కనకనే తాను నటిస్తున్న సినిమాల బడ్జెట్ పరిమితి దాటిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక తాజాగా రామ్ చరణ్ నిర్ణయం చూస్తుంటే తెలివైన, పర్ఫెక్ట్ నిర్ణయమనాల్సిందే.

అదేమిటంటే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRR చిత్రానికి రామ్ చరణ్ హీరోగానూ... స్లీపింగ్ ప్రొడ్యూసర్ గాను ఉండబోతున్నాడట. అదికూడా తన పారితోషకాన్ని ఆ సినిమాలో పెట్టుబడిగా పెడుతున్నాడనే టాక్ వినబడుతుంది. కేవలం #RRR పారితోషకమే కాకుండ ప్రస్తుతం తాను నటిస్తున్న వినయ విధేయరామ పారితోషకాన్ని కూడా #RRR లో పెట్టుబడి పెడుతున్నాడట. వినయ విధేయరామకి, #RRR కి నిర్మాత దానయ్య కాబట్టి.. నిర్మాత కి భారం తగ్గించడానికి రామ్ చరణ్ ఇలా స్లీపింగ్ పార్టనర్ గా #RRR కి పనిచేస్తున్నాడని సమాచారం.

మరి గతంలో మరో హీరో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు #RRR కి పారితోషకంగా కాకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటారనే ప్రచారం జరిగింది. ఇక తాజాగా రామ్ చరణ్ తన రెండు పారితోషకాలను దానయ్యతో కలిసి #RRR కి పెట్టుబడిగా పెట్టడమే కాదు.. లాభాల్లో వాటా కూడా అడగ్గా.. ఎలాగూ భారీ బడ్జెట్ చిత్రమైన #RRR కి మరో నిర్మాత తోడు అవసరం అని భావించిన దానయ్య, రామ్ చరణ్ ప్రపోజల్ కి వెంటనే ఒప్పేసుకున్నాడట. మరి అలా #RRR కి స్లీపింగ్ ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ పెట్టుబడి పెట్టి భారీ అంచనాలున్న, క్రేజున్న ఈ #RRR తో భారీగా లాభపడినట్లే. అందుకే రామ్ చరణ్ పర్ఫెక్ట్ నిర్మాత అన్నది.

Similar News