సైరా వాయిదా పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ సైరా చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని అక్టోబర్ 2 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా ఉంది. చిరు కెరీర్ [more]

Update: 2019-08-30 05:35 GMT

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ సైరా చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని అక్టోబర్ 2 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా ఉంది. చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా పై గత కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. అదే ఈమూవీ వాయిదా పడే అవకాశముందని. హిందీ లో హృతిక్ – టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' చిత్రంతో పోటీ పడకుండా 'సైరా'ను వాయిదా వేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

అక్టోబర్ 8 న సైరా రిలీజ్ చేస్తున్నారు అని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు ఈసినిమా ను వాయిదా వేస్తున్నారు అని టాక్. అయితే కొన్ని రోజులు నుండి ఈ ప్రచారం జరుగుతున్న నిర్మాత హోదాలో రామ్ చరణ్ కానీ కొణిదెల కంపెనీ కానీ వెంటనే ఖండించకపోవడంతో ఇప్పటివరకూ సస్పెన్సె కొనసాగింది.

అయితే నిన్న మధ్యాహ్నం నిర్మాత దీనిపై స్పందించాడు. నిన్న జరిగిన ఓ ఈవెంట్ లో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. సైరా వాయిదా వార్త నిజమేనా? అంటూ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చరణ్…..“సైరా వాయిదా లేదు. అవన్నీ రూమర్లు. చెప్పిన టైముకే వచ్చేస్తున్నాం“ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు

Tags:    

Similar News