చరణ్ మాత్రమే కాదు... మెగాస్టార్ తో కూడా..!

Update: 2018-07-02 06:29 GMT

ఒక్కప్పుడు నిర్మాత కె.ఎస్.రామారావు, చిరంజీవి కలిసి చాలా సినిమాలు చేశారు. దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. లాస్ట్ గా వీరి కాంబినేషన్ లో ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ వచ్చి ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తో ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాతో మెగా కాంపౌండ్లోకి వచ్చాడు రామారావు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. రామారావు బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా ఉంటుందని తెలిపారు. అయితే చరణ్‌తోనే కాక చిరంజీవితో కూడా తాను సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు రామారావు ప్రకటించారు.

కచ్చితంగా హిట్ అవుతుంది...

చిరంజీవితో సినిమా చేసే ప్రయత్నం కచ్చితంగా చేస్తానని చెప్పారు రామారావు. తానూ ఇప్పటిదాకా 45 సినిమాలు నిర్మించానని.. అందులో నాలుగైదు మాత్రమే ఫ్లాప్ అయ్యానని.. తనకంటూ ఒక అభిరుచి ఉందని రామారావు చెప్పారు. ‘తేజ్ ఐ లవ్ యూ’ కచ్చితంగా హిట్ అవుతుందని భరోసా ఇచ్చారు. సినిమాలో సీన్స్ నచ్చకపోతే డైరెక్టర్ తో చెప్పి ఆ సీన్స్ మార్పించే సామర్థ్యం ఉందని రామారావు అన్నారు.

Similar News