చరణ్ పక్కన కేథరిన్ కాదు.. ఈషా అంట

Update: 2018-12-13 03:44 GMT
Ram Charan Junior NTR Rajamouli #RRR

బోయపాటి - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న వినయ విధేయరామ షూటింగ్ చివరి దశలో ఉంది. విడుదలకు కేవలం ఒక నెల మాత్రమే టైం ఉండడంతో సినిమా సాంగ్ షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకచకా పూర్తి చేస్తుంది వివిఆర్ టీం. సంక్రాంతికి సినిమా రిలీజ్ అని చెప్పడం రాజమౌళి సినిమా కోసం రామ్ చరణ్ కొన్నిరోజులు వెళ్లడంతో.. వివిఆర్ పై అనేక అనుమానాలు మొదలయ్యాయి. అందులోను వివిఆర్ పబ్లిసిటీ కాస్త వీక్ అవడంతో మెగా ఫాన్స్ వర్రీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉన్న వినయ విధేయ రామ బృందం.. ఇపుడు ఐటెం పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన పబ్ సెట్ లో చిత్రీకరించనున్నారట.

అయితే వినయ విధేయరామ లో రామ్ చరణ్ సరసన ఐటెం స్టెప్స్ వెయ్యబోయే భామ విషయంలో చాలా పేర్లే వినిపించాయి. ముందు రకుల్ ఒప్పుకోలేదని తర్వాత కాజల్ కాదందని.. చివరికి బోయపాటికి ఇష్టమైన కేథరిన్, రామ్ చరణ్ సరసన మాస్ స్టెప్స్ వెయ్యబోతుందని గట్టిగా ప్రచారం జరిగింది. ఇక కేథరిన్ ఫైనల్ అనుకున్న టైం లో ఇప్పుడు కేథరిన్ ప్లేస్ లోకి మరో బాలీవుడ్ భామ దిగబోతుందట. ఆమె ఎవరో కాదు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోయి.. కుర్రకారు మతులను పోగెట్టే హాట్ బేబీ ఈషా గుప్తా.

చరణ్ తో కలిసి వినయ విధేయరామ సినిమాలో పబ్ సాంగ్ లో మాస్ స్టెప్స్ తో అలరించబోయే ఆ హాట్ భామ ఈషా గుప్తా అంటున్నారు. మరి తాజా సమాచారం ప్రకారం ఈషా గుప్తా విన విధేయ రామ కోసం బాలీవుడ్ నుండి దిగడం ఖాయమేనట. చూద్దాం ఈ హాట్ భామ హాట్ స్టెప్స్ వినయ విధేయరామకి ఎంత ప్లస్ అవుతాయో అనేది

Similar News