లుక్ లోను, టీజర్ లోను చరణేనా.. మరి హీరోయిన్?

Update: 2018-11-10 05:30 GMT

బోయపాటి - రామ్ చరణ్ కలయికలో మొదటిసారిగా తెరకెక్కుతున్న మాస్ ఎంటెర్టైనెర్ వినయ విధేయరామ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ తో మెగా అభిమానులకు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు ఇచ్చేసాడు చరణ్. ఫస్ట్ లుక్ లో మాస్ హీరోగా కనబడిన రామ్ చరణ్ టీజర్ లోను బోయపాటి సినిమాలను తలదన్నే రీతిలో మాస్ లుక్ లోనే కనబడ్డాడు. అయితే మెగా అభిమానులకు రామ్ చరణ్ అలా మాస్ లుక్ కనబడడం అనేది పండగలాంటిదే అయినా.. చాలామంది రామ్ చరణ్ లుక్ కాస్త రొటీన్ గా ఉందనే కామెంట్స్ పడ్డాయి. ఎందుకంటే బోయపాటి సినిమాల్లో హీరోలు మొత్తంగా మాస్ తరహాలోనే కనబడతారు.

ఇక అన్ని సినిమాల కన్నా ఈ సినిమా లో మాస్ యాక్షన్ కాస్త ఎక్కువగానే కనబడింది. మరి ఫస్ట్ లుక్ లోను చరణ్ నే దింపి, టీజర్ మొత్తం రామ్ చరణ్ యాక్షన్ నే కట్ చేసిన బోయపాటి హీరోయిన్ ని ఎక్కడా పరిచయం చెయ్యలేదు. రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రంలో ఇంతవరకు హీరోయిన్ లుక్ మాత్రం బయటికి రాలేదు. భరత్ అనే నేను లో మహేష్ సరసన వసుమతిగా సాదా సీదా పాత్రలో కనబడిన కియారా రామ్ చరణ్ సినిమాలో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంది. మరి లుక్ లోను, టైటిల్ లోను, టీజర్ లోను హీరోయిన్ కి బోయపాటి చోటు లేకుండా చేసాడు.

మరి మళ్ళీ ఏ స్పెషల్ అకేషన్ లో కియారా అద్వానీ లుక్ వదులుతాడా అనే ఆసక్తితో జనాలు ఉన్నారు. చూద్దాం... హీరో రామ్ చరణ్ ని స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపెట్టిన బోయపాటి హీరోయిన్ కియారని ఎలా చూపించబోతున్నాడో అనేది. మరి బోయపాటి సీనియాల్లో హీరోయిన్ కి హీరోలతో సమానంగా కాకపోయినా మంచి ప్రాధాన్యతే ఉంటుంది. చాలా భారీ బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్ అలా వచ్చి వెళ్లిపోయే పాత్రలుగా కాకుండా హీరోయిన్ పాత్రలను బోయపాటి బాగానే చూపిస్తాడు. చూద్దాం వినయ విధేయరామాలో కియారా లుక్ అండ్ స్టయిల్ ఎలా ఉండబోతుందో అనేది.

Similar News