చివరికి ఓకే చెప్పిన రామ్

ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ ఎంటర్టైనర్ తో మనల్ని అలరించిన రామ్ నెక్స్ట్ ఏం చేయాలో అని డైలమాలో పడ్డాడు. నెక్స్ట్ కొత్త త‌ర‌హా సినిమా చేస్తే [more]

Update: 2019-10-18 08:20 GMT

ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ ఎంటర్టైనర్ తో మనల్ని అలరించిన రామ్ నెక్స్ట్ ఏం చేయాలో అని డైలమాలో పడ్డాడు. నెక్స్ట్ కొత్త త‌ర‌హా సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది అర్ధం కావడంలేదు రామ్ కి. మళ్లీ మాస్ సినిమా చేసినా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో అని ఆలోచనలో ఉన్నప్పుడు రామ్ కి తమిళ చిత్రం త‌డం రీమేక్‌లో నటించాలని నిర్ణయించుకున్నాడు. మొదట ఈ సినిమా చేయకూడదు అని భావించి మళ్లీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

త్వరలోనే విడుదల…

రామ్ తో… నేను శైలజ, ఉన్న‌ది ఒక‌టే, జింద‌గీ సినిమాలు తీసిన కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలోనే రామ్ త‌డ‌మ్ రీమేక్ చేయ‌బోతున్నాడు. హీరోయిన్స్ గా నివేదిత పెతురాజ్‌, మాళ‌విక శ‌ర్మ నటించనున్నారు. తమిళంలో తడం హిట్ అయినా వెంటనే రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ రైట్స్ సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుంది. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని సమాచారం.

 

Tags:    

Similar News