మరి నెక్స్ట్ ఏంటి?

హీరోయిన్ రకుల్ ప్రీత్ ఎంత కాన్ఫిడెంట్ గా కనిపించినా ఆమె చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. నాగార్జున తో నటించిన మన్మధుడు 2 [more]

Update: 2019-08-06 04:02 GMT

హీరోయిన్ రకుల్ ప్రీత్ ఎంత కాన్ఫిడెంట్ గా కనిపించినా ఆమె చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. నాగార్జున తో నటించిన మన్మధుడు 2 సినిమా విడుదలయ్యాక.. ఈ భామ టాలీవుడ్ లో అయితే ఖాళీ. మరోతెలుగు సినిమా రకుల్ ప్రీత్ చేతిలో లేదు. తమిళనాట మాత్రం రెండు సినిమాలున్నాయి. తమిళంలోనూ భారీ డిజాస్టర్స్ సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ కమల్ హాసన్ సినిమా ఇండియన్ 2 లో కాజల్ తో పాటుగా సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్ లోను రకుల్ ప్రీత్ నటించిన మార్జావాన్ కూడా విడుదలకు సిద్దమవుతుంది. ఇక బాలీవుడ్ లోను పాపకి పెద్దగా సినిమాలు లేవు.

మన్మధుడు తర్వాత….

సీనియర్ హీరో నాగార్జున సరసన చాల బోల్డ్ గా సిగరెట్, మందు కొడుతూ మన్మధుడు 2 లో రకుల్ ప్రీత్ నటించింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ చాలా సెక్సీ గా స్పైసి గా కనిపిస్తుంది. ఇక మన్మధుడు 2 ప్రమోషన్స్ లోను రకుల్ ప్రీత్ చాలా హాట్ హాట్ డ్రెస్సులతో అదరగొట్టేస్తుంది. కానీ యంగ్ అండ్ స్టార్ హీరోల చూపు మాత్రం రకుల్ ప్రీత్ మీద పడడం లేదు. అందుకే అమ్మడుకి తెలుగులో అవకాశాలు నిల్. మరి తమిళంలో ఉన్న రెండు సినిమాలు రకుల్ ప్రీత్ కెరీర్ ని డిసైడ్ చేస్తాయేమో చూడాలి. ఎందుకంటే రకుల్ ప్రీత్ నటించిన మన్మధుడు 2 ఒకవేళ హిట్ అయినా… దానివల్ల రకుల్ కి పెద్దగా ఉపయోగం ఉండేలా కనబడ్డం లేదు. ఎందుకంటే సీనియర్ హీరోల పక్కన నటించిన హీరోయిన్స్ కి డిమాండ్ అంతగా ఉండదు. మరి రకుల్ ప్రీత్ మన్మధుడు రేపు శుక్రవారమే విడుదలకాబోతుంది. మరి ఆ మన్మధుడు తర్వాత వాట్ నెక్స్ట్ అంటూ రకుల్ ప్రీత్ కి సోషల్ మీడియాలో అభిమానులు క్వచ్చన్ చేస్తున్నారు.

Tags:    

Similar News