ఈ అందాన్ని సీనియర్స్ కే ఆరబోస్తుందా?

చేతిలో సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో రకుల్ ప్రీత్ కన్నా ముందెవరు ఉండరు. జిమ్ డ్రెస్ అయినా, ఎయిర్పోర్ట్ అయినా ఎందులోనైనా రకుల్ హాట్ [more]

Update: 2020-08-10 04:46 GMT

చేతిలో సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో రకుల్ ప్రీత్ కన్నా ముందెవరు ఉండరు. జిమ్ డ్రెస్ అయినా, ఎయిర్పోర్ట్ అయినా ఎందులోనైనా రకుల్ హాట్ అందాల ముందు అందరూ దిగదుడుపే. లాక్ డౌన్ లోను సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో హంగామా  చేస్తున్న రకుల్ ని స్టార్ హీరోలు లైట్ తీసుకున్నారు. మరోవైపు యంగ్ హీరోలు రకుల్ ని పట్టించుకోవడం లేదు. అలాంటి టైం లోనే టాలీవుడ్ లోను, బాలీవుడ్ లోను సీనియర్ హీరోలకి గాలం వేస్తుంది. ఇప్పటికే తెలుగులో నాగార్జున మన్మధుడు 2 లో నటించిన రకుల్.. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తోనూ నటించింది.

తాజాగా రకుల్ టాలీవుడ్ సీనియర్ హీరోలకి ఓకె చెప్పబోతోంది అనే టాక్ నడుస్తుంది. ఒకప్పుడు ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో నటించిన రకుల్ ప్రీత్ తాజాగా చిన్న హీరోలెవరు అవకాశాలు ఇవ్వడం లేదు. అందుకే సీనియర్స్ కి కమిట్ అవుదామని రకుల్ డెసిషన్ తీసుకుందట. అందులో భాగంగా చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్స్ కి తాను మీ సినిమాల్లో నటించడానికి సిద్దమనే సంకేతాలు పంపుతుంది. ఇప్పటికే సీనియర్ హీరోల నుండి రకుల్ కి ఆఫర్స్ వెళుతున్నాయని.. రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. కమిట్ అవడానికి రెడీగా ఉందట. 

Tags:    

Similar News