రకుల్ అదృష్టం అలా ఉందా?

రకుల్ ప్రీత్ కి అవకాశాలు లేవు, రావడం లేదనేది జగమెరిగిన సత్యమే. కానీ రకుల్ అలా అంటే ఒప్పుకోదు. తానే సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేక్ [more]

Update: 2020-08-16 01:59 GMT

రకుల్ ప్రీత్ కి అవకాశాలు లేవు, రావడం లేదనేది జగమెరిగిన సత్యమే. కానీ రకుల్ అలా అంటే ఒప్పుకోదు. తానే సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చా అంటూ చెప్పుకుంటుంది. అయితే తాజాగా రకుల్ కి తమిళనాట కమల్ హాసన్ ఇండియన్ 2 లోను, తెలుగులో నితిన్ – చందు మొండేయ్ సినిమాలో ఆఫర్ ఉండాలి. అయితే కొన్నాళ్లుగా అవకాశాలు లేని రకుల్ కి పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ మంచి ఆఫర్ వచ్చింది అనే టాక్ నడుస్తుండగా.. ఇప్పుడు మరో కుర్ర హీరోకి రకుల్ ఓకె చెప్పినట్లుగా టాక్.

అది కూడా మొదటి సినిమా ఉప్పెనతో వెండితెరకు పరిచయమైన వైష్ణవ్వ్ తేజ్ తో రకుల్ నటించబోతుంది అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. ఉప్పెన సినిమా షూటింగ్ కంప్లేట్ అయినా… కరోనా తో ఇంకా రిలీజ్ కానీ వైష్ణవ తేజ్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అనేది క్లారిటీ లేదు. అయితే వైష్ణవ్వ్ తేజ్ సెకండ్ మూవీలో రకుల్ హీరోయిన్  అంటున్నారు. అయితే వైష్ణవ తేజ్ రెండో సినిమాని పవన్ దర్శకుడు క్రిష్ తో చేస్తున్నాడు. క్రిష్ కూడా పవన్ సినిమాకి భారీ గ్యాప్ రావడంతో ఈలోపు వైష్ణవ తేజ్ తో ఓ మూవీ ప్లాన్ చేసాడు. ఆ సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నాడట క్రిష్. మరి పవన్ సినిమాలోనూ, ఆయన మేనల్లుడు సినిమాలోనూ రకుల్ కి ఒకేసారి అవకాశం రావడం నిజం గా రకుల్ అదృష్టమే.

Tags:    

Similar News